Hyderabad: భాగ్యనగరంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రులు కేటిఆర్, తలసాని

Hyderabad: ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు అన్నారు పెద్దలు. ఎందుకంటే ఓ వ్యక్తి జీవితంలో ఈ రెండే ప్రధానమై ఘట్టాలన్నారు మంత్రి కేటీఆర్‌. సికింద్రాబాద్‌(Secunderabad), సనత్‌ నగర్‌(Sanath Nagar) నియోజకవర్గాల్లో..

Hyderabad: భాగ్యనగరంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రులు కేటిఆర్, తలసాని
Minister Ktr At Sanath Nagar
Follow us

|

Updated on: Feb 12, 2022 | 7:11 PM

Hyderabad: ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు అన్నారు పెద్దలు. ఎందుకంటే ఓ వ్యక్తి జీవితంలో ఈ రెండే ప్రధానమై ఘట్టాలన్నారు మంత్రి కేటీఆర్‌. సికింద్రాబాద్‌(Secunderabad), సనత్‌ నగర్‌(Sanath Nagar) నియోజకవర్గాల్లో 61 కోట్ల రూపాయల అభివృద్ధి పనులను ప్రారంభించారు మంత్రి కేటీఆర్‌(Minister KTR). ప్రజా సమస్యల పరిష్కారంలో, పథకాల అమలులో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముందుంటారని ప్రశంసించారు కేటీఆర్‌. ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా అది సనత్ నగర్ నియోజకవర్గం నుంచే అమలు అమలవుతోందన్నారు మంత్రి.

నిరుపేదలు శుభకార్యాల నిర్వహణ కోసం లక్షలు ఖర్చు చేయాల్సి వస్తోందన్నారు మంత్రి కేటీఆర్‌. వారి ఇబ్బందులను గుర్తించి పాటిగడ్డలో పేద, మధ్య తరగతి ప్రజల కోసం 1200 గజాల స్థలాన్ని GHMCకి బదలాయించామన్నారు కేటీఆర్‌. 6 కోట్ల రూపాయలతో ఫంక్షన్ హాల్‌ను నిర్మిస్తున్నట్లు చెప్పారు మంత్రి కేటీఆర్‌. నామమాత్రపు ధరతో ఫంక్షన్ హాల్‌ అద్దెకు తీసుకోవచ్చన్నారు. సికింద్రాబాద్‌ SP రోడ్ లో ప్యాట్నీ నాలా పై 10 కోట్లతో వ్యయంతో నిర్మించబోయే వంతెన పనులను ప్రారంభించారు మంత్రి. 45 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టే బేగంపేట నాలా అభివృద్ధి పనులను అల్లంతోట బావి, బ్రాహ్మణ వాడిలో ప్రారంభించారు మంత్రి కేటీఆర్‌. ఆయన వెంట మంత్రలు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, మల్లారెడ్డి, ఎమ్మెల్యే సాయన్న, మేయర్‌ విజయలక్ష్మి ఉన్నారు.

Also Read:

అమ్మాయి కోసం హీరోలా సముద్రంలోకి దూకిన 60ఏళ్ల వృద్ధుడు.. తీరా చూస్తే.. నవ్వులే నవ్వులు

సుందర్ కోసం కష్టాలు పడ్డ సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఎస్‌ఆర్‌హెచ్ జాబితాలో ఎవరు చేరారంటే?