Minister KTR: కిషన్‌ రెడ్డికి కేటీఆర్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌.. మెడికల్‌ కళాశాలల మంజూరు విషయంలో తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ మండిపాటు

మెడికల్‌ కాలేజీల కేటాయింపు విషయంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలకు గట్టిగా కౌంటరిచ్చారు మంత్రి కేటీఆర్‌. మెడికల్‌ కళాశాలల విషయంలో కేంద్రమంత్రి తప్పుడు ప్రచారం చేస్తున్నారని  ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు

Minister KTR: కిషన్‌ రెడ్డికి కేటీఆర్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌.. మెడికల్‌ కళాశాలల మంజూరు విషయంలో తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ మండిపాటు
Ktr Vs Kishan Reddy
Follow us

|

Updated on: Oct 01, 2022 | 11:00 AM

తెలంగాణలో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. రాష్ట్రానికి కేంద్రం అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తోందని బీజేపీ నేతలు అంటుంటే.. అవన్నీ ఒట్టి మాటలేనని టీఆర్‌ఎస్‌ మంత్రులు, ఎమ్మెల్యేలు ఎదురుదాడి చేస్తున్నారు.ఈనేపథ్యంలో మెడికల్‌ కాలేజీల కేటాయింపు విషయంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలకు గట్టిగా కౌంటరిచ్చారు మంత్రి కేటీఆర్‌. మెడికల్‌ కళాశాలల విషయంలో కేంద్రమంత్రి తప్పుడు ప్రచారం చేస్తున్నారని  ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు.  ‘ కిషన్‌ రెడ్డి గారూ..నేను మిమ్మల్ని సోదరునిగా గౌరవిస్తాను. కానీ మెడికల్‌ కళాశాలల కేటాయింపు గురించి మీరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఈ విషయంలో మీరు చేసిన వ్యాఖ్యలను నేను ఖండిస్తున్నాను. మీ లాంటి కేంద్ర కేబినెట్ మంత్రిని చూడలేదు. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం 9 మెడికల్ కాలేజీలు మంజూరు చేసిందని మీరు ప్రకటించారు, అది అబద్ధం’

‘ కిషన్ రెడ్డి కి క్షమాపణ చెప్పే ధైర్యం కూడా లేదు. హైదరాబాదులో గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు మీరు ప్రకటించారు. ఎప్పటిలాగే, మీ గుజరాతీ బాస్‌లు దానిని వారి రాష్ట్రానికి మార్చారు. ఈ విషయంలో మీరు హైదరాబాద్ ప్రజలను తప్పుదోవ పట్టించారు. ఇంత జరుగుతున్నా మీరు మీ తప్పుడు వాదనలను సరిదిద్దుకోలేదు. తెలంగాణా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను కేంద్ర ప్రభుత్వం ఎందుకు తుంగలో తొక్కుతున్నదో ప్రధాని మోడీ సమాధానం చెప్పాలి. తెలంగాణకు గానీ, పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌కు గానీ ఇచ్చిన ఒక్క హామీని కూడా నిలబెట్టుకోకపోవడం సిగ్గుచేటు’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు కేటీఆర్‌.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్
విరూపాక్ష డైరక్టర్‌‌తో అక్కినేని యంగ్ హీరో..
విరూపాక్ష డైరక్టర్‌‌తో అక్కినేని యంగ్ హీరో..
హార్దిక్‌కు మద్దతుగా సోనూసూద్.. ట్రోలర్స్‌కు హిత బోధ..ఏమన్నాడంటే?
హార్దిక్‌కు మద్దతుగా సోనూసూద్.. ట్రోలర్స్‌కు హిత బోధ..ఏమన్నాడంటే?
యూట్యూబ్‌ భారీ షాక్‌.. 9 మిలియన్లకు పైగా వీడియోల తొలగింపు.. కారణం
యూట్యూబ్‌ భారీ షాక్‌.. 9 మిలియన్లకు పైగా వీడియోల తొలగింపు.. కారణం
51ఏళ్ల వయసులో క్రికెట్‌తో అదరగొట్టిన కేంద్ర మంత్రి ఆరోగ్య మంత్రి.
51ఏళ్ల వయసులో క్రికెట్‌తో అదరగొట్టిన కేంద్ర మంత్రి ఆరోగ్య మంత్రి.
ఎన్నికల సమరంలో తారాతీరం.. క్రీడాలోకం.. ప్రచారమే కాదు.. పోటీకీ సై
ఎన్నికల సమరంలో తారాతీరం.. క్రీడాలోకం.. ప్రచారమే కాదు.. పోటీకీ సై
ఐటీఆర్ మిస్‌మ్యాచ్ అయిన వాళ్లకు షాక్..!
ఐటీఆర్ మిస్‌మ్యాచ్ అయిన వాళ్లకు షాక్..!
అమ్మబాబోయ్.. ఏం వయ్యారం..! తల్లిని మించిన అందంతో..
అమ్మబాబోయ్.. ఏం వయ్యారం..! తల్లిని మించిన అందంతో..
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
మీన రాశిలో శుక్రుడు సంచారం.. ఆ రాశుల వారికి సుఖ సంతోషాలు
మీన రాశిలో శుక్రుడు సంచారం.. ఆ రాశుల వారికి సుఖ సంతోషాలు