Minister KTR: రద్దు చేయండి.. ఒకేసారి ముందస్తు ఎన్నికలకు వెళ్దాం.. ముందస్తు ఎన్నికలపై మంత్రి కేటీఆర్‌ క్లారిటీ..

ఒకేసారి ముందస్తుకు వెళ్దామంటూ సవాల్‌ విసిరారు. ఎవరేంటో ప్రజలే తేలుస్తారన్న కేటీఆర్‌..నిజామాబాద్‌ ఎంపీ అర్వింద్‌కు వార్నింగ్‌ ఇచ్చారు. నిజామాబాద్ జిల్లాలో ముందస్తుకు సిద్ధమని ప్రకటించారు మంత్రి కేటీఆర్.

Minister KTR: రద్దు చేయండి.. ఒకేసారి ముందస్తు ఎన్నికలకు వెళ్దాం.. ముందస్తు ఎన్నికలపై మంత్రి కేటీఆర్‌ క్లారిటీ..
Minister Ktr
Follow us

|

Updated on: Jan 29, 2023 | 8:57 AM

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వస్తాయన్న బీజేపీ నేతలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి కేటీఆర్. దమ్ముంటే పార్లమెంట్‌ను రద్దు చేయండి.. ఒకేసారి ముందస్తుకు వెళ్దామంటూ సవాల్‌ విసిరారు. ఎవరేంటో ప్రజలే తేలుస్తారన్న కేటీఆర్‌..నిజామాబాద్‌ ఎంపీ అర్వింద్‌కు వార్నింగ్‌ ఇచ్చారు. నిజామాబాద్ జిల్లాలో ముందస్తుకు సిద్ధమని ప్రకటించారు మంత్రి కేటీఆర్. పార్లమెంట్‌ను రద్దు చేసి బీజేపీ ముందస్తు వస్తే..తామూ అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు సిద్ధమంటూ కుండబద్ధలు కొట్టారు. వాళ్లకు దమ్ముంటే పార్లమెంట్‌ను రద్దు చేసి రమ్మనండి అని ఛాలెంజ్‌ చేశారు. అప్పుడు అందరూ కలిసి ముందస్తు ఎన్నికలకు వెళ్దామన్నారు.

కాకతీయ స్యాండ్ బాక్స్ స్టార్టప్ సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరైన కేటీఆర్ నిజామాబాద్‌లో సుడిగాలి పర్యటన చేశారు. రైల్వే అండర్ బ్రిడ్జ్ ప్రారంభం, ఇందూరు కళాభారతి నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ అరవింద్‌కు సవాళ్లు విసురుతూ సాగింది మంత్రి ప్రసంగం. పెద్దాయన కొడుకవనే ఊరుకుంటున్నామని స్థానిక ఎంపీ ధర్మపురి అరవింద్‌కు వార్నింగ్‌ ఇచ్చారు కేటీఆర్‌. తొమ్మిదేళ్ల పాలనలో మోదీ సర్కార్ తెలంగాణకు ఒక్క విద్యాసంస్థ కూడా ఇవ్వలేదన్నారు. మోడీ ప్రభుత్వం మాటలు సబ్ కా సాత్ సబ్ కా వికాస్.. కానీ అంతా సబ్ బక్వాజ్ లా సాగుతోందని విమర్శించారు మంత్రి కేటీఆర్‌.

కేటీఆర్ నిజామాబాద్‌ టూర్‌లో నిరసనల పర్వం కనిపించింది. కలెక్టరేట్ నుంచి భూమారెడ్డి కన్వెన్షన్ హాల్‌కు వెళ్లే మార్గంలో కంఠేశ్వర్ దగ్గర కార్పొరేటర్ రోహిత్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు కాన్వాయ్‌కి అడ్డుతగిలేందుకు యత్నించడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎల్లమ్మగుట్టలో అండర్ గ్రౌండ్ రైల్వే బ్రిడ్జ్ ప్రారంభించి.. ఇందూరు కళాభారతి నిర్మాణానికి భూమిపూజ చేసి బీఆర్ఎస్ కార్యాలయానికి చేరుకునే క్రమంలో బీజేపి నేతలు మరోసారి మంత్రి కేటీఆర్ కాన్వాయ్‌కి అడ్డు తగిలారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం

మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..