Minister Harish Rao: ప్రజల ఆరోగ్యానికి తెలంగాణ సర్కార్ పెద్దపీట.. డయాగ్నొస్టిక్ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి హరీష్ రావు

తెలంగాణ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తోందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. ఇందులో భాగంగా అధునాతన సౌకర్యాలతో మెరుగైన వైద్య చికిత్సలు..

Minister Harish Rao: ప్రజల ఆరోగ్యానికి తెలంగాణ సర్కార్ పెద్దపీట.. డయాగ్నొస్టిక్ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి హరీష్ రావు
Minister Harish Rao Inaugur
Follow us

|

Updated on: Jun 09, 2021 | 4:15 PM

తెలంగాణ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తోందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. ఇందులో భాగంగా అధునాతన సౌకర్యాలతో మెరుగైన వైద్య చికిత్సలు అందించడానికి ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేస్తున్నట్లు పేర్కొన్నారు. బుధవారం సంగారెడ్డి జిల్లా కేంద్ర ఆస్పత్రిలో తెలంగాణ డయాగ్నొస్టిక్ సెంటర్‌ను ఆర్టీపీసీఆర్ టెస్టింగ్‌ కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రాష్ట్రవ్యాప్తంగా 19 డయాగ్నొస్టిక్ కేంద్రాలను సీఎం మంజూరు చేసారని త్వరలో మరో 16 కేంద్రాలను అందుబాటులోకి తెనున్నట్లుగా వెల్లడించారు. డయాగ్నొస్టిక్ సెంటర్‌లో 57 రకాల పరీక్షలు చేస్తారని స్పష్టం చేశారు. సంగారెడ్డిలో 550కోట్లతో మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీల నిర్మాణానికి మంజూరు అయ్యాయని మంత్రి హరీష్ తెలిపారు. కిడ్నీ, లివర్, థైరాయిడ్, గుండెజబ్బులు లాంటి 90 శాతం వ్యాధులకు ఉచితంగా పరీక్షలుచేస్తారని తెలిపారు. ఒకటి రెండు రోజుల్లో జిల్లా ఆసుపత్రిలో కరోనా పరీక్షలకు సంబంధించిన నాలుగు టెస్టుల ను ఉచితంగా చేస్తారని మంత్రి తెలిపారు.

జిల్లాలో 550 కోట్లతో ప్రభుత్వ వైద్య కళాశాల, నర్సింగ్ కళాశాల ఏర్పాటు కు మంజూరి వచ్చిందన్నారు. 150 సీట్లతో వైద్యకళాశాల, 100 సీట్లతో నర్సింగ్ కళాశాల మంజూరు అయిందన్నారు. నర్సింగ్ కళాశాల నిర్మాణానికి 50 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. వైద్య కళాశాల నిర్మాణానికి అవసరమైన స్థలం ప్రభుత్వ జిల్లా ఆస్పత్రి ఆవరణలో 36 ఎకరాల భూమిని గుర్తించామన్నారు నర్సింగ్ కళాశాలకు అవసరమైన స్థలాన్ని గుర్తిస్తున్నట్లు తెలిపారు. వైద్య కళాశాలకు 1200 కొత్త పోస్టులు, నర్సింగ్ కళాశాల కు 108 కొత్త పోస్టులను సాంక్షన్ చేస్తూ క్యాబినెట్ ఆమోదించినట్లు మంత్రి తెలిపారు.

ఇవి కూడా చదవండి : Peppar Rice: నెలకి ఒకసారైనా తింటే ఆరోగ్యాన్ని ఇచ్చే మిరియాల అన్నం.. తయారీ ఎలా అంటే

Surrogacy Children: ప్రేమా..పిచ్చా.. వామ్మో దీనిని ఏమంటారు.. ఏకంగా వందమంది పిల్లల కోసం ప్రయత్నాలు.. ఇప్పటికే 21 మంది