Basti Dawakhana: మ‌రో 131 బ‌స్తీ ద‌వాఖాన‌లు ఆగష్టు 15లోగా సిద్ధం.. అధికారులకు మంత్రి హరీశ్ రావు అదేశం..

ఆగ‌స్ట్ 15లోగా బ‌స్తీ ద‌వాఖాన‌లు సిద్ధం కావాలన్నారు మంత్రి హరీష్. వైద్యశాఖ అధికారులకు ఆదేశాలు చేశారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఇంటర్నేషనల్ హాస్పిటల్స్ గ్రూప్ సిద్ధంమైంది.

Basti Dawakhana: మ‌రో 131 బ‌స్తీ ద‌వాఖాన‌లు ఆగష్టు 15లోగా సిద్ధం.. అధికారులకు మంత్రి హరీశ్ రావు అదేశం..
Minister Harish Rao
Follow us

|

Updated on: Jun 22, 2022 | 9:06 PM

సీఎం కేసీఆర్ ఆలోచనతో ఏర్పాటైన బస్తీ దవాఖానాలు.. గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలోని పేద‌ల‌కు వైద్య ఖ‌ర్చుల భారాన్ని త‌గ్గిస్తున్నాయని చెప్పారు వైద్యారోగ్య శాఖ మంత్రి హ‌రీశ్‌రావు. ప్రజెంట్ జీహెచ్ఎంసీలో 259 బ‌స్తీ ద‌వాఖానాలు గ్రేటర్ ప్రజ‌ల‌కు అందుబాటులోకి వచ్చాయన్నారు మంత్రి హరీష్. అలాగే ఇప్పటికే సిద్ధంగా ఉన్న మరో 12 బ‌స్తీ ద‌వాఖానాల‌ను వెంటనే ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి. అలాగే గ్రేటర్ పరిధిలో ఏర్పాటవుతున్న మ‌రో 131 బ‌స్తీ ద‌వాఖాన‌లు ఆగష్టు 15లోగా సిద్ధం చేయాలని వైద్యశాఖ అధికారులను ఆదేశించారు మంత్రి.

ఈమేరకు వైద్యశాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు మంత్రి. బస్తీ దవాఖానాల్లో జరుగుతున్న సేవలు ఆన్ లైన్ చేయాలని అధికారులకు కీలక సూచనలు చేశారు. ప్రజలకు టెలీ క‌న్స‌ల్టేష‌న్ సేవ‌లను పెంచాల‌న్నారు. టీ డయాగ్నొస్టిక్ సహకారంతో ఎక్కడిక్కడే శాంపిల్స్ సేకరణ చేసి.. రిజల్ట్ వెంటనే చెప్పాలని సూచించారు.

హైదరాబాద్ లో హరీశ్ రావుతో బ్రిటిష్ హై కమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్, ఇంటర్నేషనల్ హస్పిటల్స్ గ్రూప్ సీఈవో చేస్టర్ కింగ్, సీవోవో సైమన్ ఆశ్వర్త్, భారత్ ప్రతినిధి పృథ్వి సహాని, పలు ప్రతినిధులు భేటీ అయ్యారు. రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు, సూపర్ స్పెషాలటీ ఆసుపత్రుల ఏర్పాటును పోత్సహిస్తున్న ప్రభుత్వంపై ఇంటర్నేషనల్ హాస్పిటల్స్ గ్రూప్ ప్రతినిధులు ప్రశంసలు కురిపించారు.

ఇవి కూడా చదవండి

సాంకేతిక సహకారం అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు మంత్రితో చెప్పారు. ఇంటర్నేషనల్ హాస్పిటల్స్ గ్రూప్ తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నట్లు అండ్రూ ఫ్లెమింగ్ తెలిపారు.

తెలంగాణ వార్తలు

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!