కాజీపేట రైల్ కోచ్ ఫ్యాక్టరీకి ఏర్పాటు అవసరం లేదన్న కేంద్రంపై తీవ్రస్థాయిలో మండిపడ్డ మంత్రి ఎర్రబెల్లి

Errabelli Dayakar Rao: కాజీపేట రైల్ కోచ్ ఫ్యాక్టరీకి ఏర్పాటు అవసరం లేదన్న కేంద్రంపై రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌రఫ‌రా శాఖ‌ల మంత్రి ..

  • Subhash Goud
  • Publish Date - 6:30 am, Fri, 5 March 21
కాజీపేట రైల్ కోచ్ ఫ్యాక్టరీకి ఏర్పాటు అవసరం లేదన్న కేంద్రంపై తీవ్రస్థాయిలో మండిపడ్డ మంత్రి ఎర్రబెల్లి

Errabelli Dayakar Rao: కాజీపేట రైల్ కోచ్ ఫ్యాక్టరీకి ఏర్పాటు అవసరం లేదన్న కేంద్రంపై రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌రఫ‌రా శాఖ‌ల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు‌ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అయితే సమాచార హక్కు చట్టం ప్రశ్నకి రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు అవసరం లేదన్న కేంద్ర రైల్వే శాఖ.. ఇప్పుడు బీజేపీ తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్‌ చేస్తున్నారు. ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారు? అని ప్రశ్నించారు. ఇంకా ఎన్ని అబ‌ద్ధాలు అడ‌తారు? ప్రజలను ఎంతకాలం మోసం చేస్తారని ఆయన అన్నారు. బీజేపీ అంటే భారతీయ బొంకుడు పార్టీ అని తేలిపోయిందని, టీఆర్‌ఎస్‌ త్యాగాల పునాదుల మీద తెలంగాణ రాష్ట్ర పునర్ నిర్మాణం చేస్తుంటే, బీజేపీ అబద్ధాల పునాదుల మీద అధికారం కోసం అర్రులు చాస్తున్నదని ఆరోపించారు. ఇప్పుడు ఏకంగా రాష్ట్ర బీజేపీ చెవుల్లో కేంద్రం పువ్వులు పెట్టిందన్నారు.

తెలంగాణకి అన్యాయం చేయడం కేంద్రంలోని బీజేపీకి అలవాటుగా మారిందని దయాకర్‌ మండిపడ్డారు. ఐటీఐఆర్ ప్రాజెక్టు లాగే, కాజీపేట రైల్ కోచ్ ప్రాజెక్టుకి బీజేపీ మంగళం పాడిందని, చాలా కాలం నుండి రైల్ కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు డిమాండ్‌ ఉండగా, కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని పలుమార్లు కేంద్రాన్ని సిఎం కేసీఆర్ కోరినట్లు ఆయన గుర్తు చేశారు. కేంద్రం కోరిన విధంగా 150 ఎకరాల విలువైన భూమిని సేకరించి కోచ్ ఫ్యాక్టరీ కోసం రాష్ట్రం అప్పగించిందని దయాకర్‌ గుర్తు చేశారు. కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు తెలంగాణకు దక్కాల్సిన రాజ్యాంగ బద్ధమైన హక్కు రైల్ కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని పలుమార్లు కేంద్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారన్నారు. రైల్ కోచ్ ఫ్యాక్టరీ వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రజల చిరకాల కోరిక అని, తెలంగాణకు దక్కాల్సిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ సాధన కోసం ఉద్యమం చేస్తామన్నారు.

ఛత్రపతి శివాజీ మహరాజ్‌ టెర్మినస్‌కు‌ అంత ప్రత్యేకత ఏమిటి..? గోల్డ్‌ సర్టిఫికేషన్‌ రావడానికి కారణం ఏమిటి.?