తెలంగాణలో మరో రెండు రోజులు జోరు వర్షాలు..

తెలంగాణలో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. దీనికి తోడు మరో మూడ్రోజుల్లో వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి మధ్యప్రదేశ్ ప్రాంతంలో అల్పపీడనం కొనసాగుతోందని.. దీనికి అనుబంధముగా 3.6 కి.మీ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని పేర్కొంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని ఉన్న ఉత్తర బంగాళాఖాతం ప్రాంతాల్లో సుమారుగా ఆగస్టు 9న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. ఇదిలా ఉంటే.. తెలంగాణలో ఇవాళ అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి […]

తెలంగాణలో మరో రెండు రోజులు జోరు వర్షాలు..
Follow us

|

Updated on: Aug 06, 2020 | 11:37 PM

తెలంగాణలో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. దీనికి తోడు మరో మూడ్రోజుల్లో వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి మధ్యప్రదేశ్ ప్రాంతంలో అల్పపీడనం కొనసాగుతోందని.. దీనికి అనుబంధముగా 3.6 కి.మీ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని పేర్కొంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని ఉన్న ఉత్తర బంగాళాఖాతం ప్రాంతాల్లో సుమారుగా ఆగస్టు 9న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది.

ఇదిలా ఉంటే.. తెలంగాణలో ఇవాళ అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురుస్తున్నాయని హెచ్చరించింది.

గత కొద్ది రోజులుగా తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రాష్ట్రంలోని అన్ని రిజర్వాయర్లు, ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నారు. దీనికి తోడు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో మరింతగా వర్షాలు కురిసే అవకాశం వుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.