మహబూబాబాద్ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం

నామాలపాడు గ్రామం వద్ద టాటా ట్రాలీ టైర్ పేలి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 36 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను మహబూబాబాద్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం బొమ్మనపల్లి గ్రామ శివారు కొత్తతండా పంచాయితీకి చెందిన 36 మంది గిరిజనులు తిరుపతి వెళ్లేందుకు టాటా ట్రాలీలో మహబూబాబాద్ రైల్వేస్టేషన్‌కు వస్తున్నారు. ఈ క్రమంలో నామాలపాడు అడవుల్లో ట్రాలీ ఆటో టైర్ పగిలి బోల్తా పడింది. ఈ ఘటనలో 36 మంది […]

  • Tv9 Telugu
  • Publish Date - 10:49 am, Tue, 16 April 19
మహబూబాబాద్ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం

నామాలపాడు గ్రామం వద్ద టాటా ట్రాలీ టైర్ పేలి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 36 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను మహబూబాబాద్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం బొమ్మనపల్లి గ్రామ శివారు కొత్తతండా పంచాయితీకి చెందిన 36 మంది గిరిజనులు తిరుపతి వెళ్లేందుకు టాటా ట్రాలీలో మహబూబాబాద్ రైల్వేస్టేషన్‌కు వస్తున్నారు. ఈ క్రమంలో నామాలపాడు అడవుల్లో ట్రాలీ ఆటో టైర్ పగిలి బోల్తా పడింది. ఈ ఘటనలో 36 మంది గాయపడ్డారు. ఇందులో చాలా మందికి తలకు గాయాలయ్యాయి. ఓ చిన్నారి ఎడమ చేయి విరిగింది.