Man Eater Hulchul: కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని పెంచికల్ పేట్, బెజ్జూర్ మండల్లో మళ్ళీ పెద్దపులి అలజడి మొదలైంది.. ఇద్దరు ఆదివాసులను చంపిన ఏ-2 పెద్దపులి గత ఇరవై రోజులుగా కనపడకుండా వెళ్ళింది. కాని మళ్ళీ ప్రాణహిత నది, పెద్దవాగు నదుల పరివాహక ప్రాంతంలో సంచరిస్తూ బెంబేలెత్తిస్తుంది. తాజాగా నందిగాం లో మాన్ ఈటర్ సంచరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. మూడు రోజల క్రితం పెంచికల్ పేట్ మండలంలో మూడు పశువులను హతమార్చింది. మహారాష్ట్ర కు వెళ్ళినట్లు గా ఫారెస్ట్ నిర్దారణ చేసిన అనంతరం మళ్ళి ఈ ఏ-2 పెద్దపులి ఈ ప్రాంతంలోకి రావడంతో మారుమూల ఆదివాసి గిరిజన గ్రామాల ప్రజలు భయాందోళనకు గురౌతున్నారు. పెంచికల్ పేట్ మండలం నందిగాం, కమ్మర్ గామ్, అగరుగూడ గ్రామాల సమీపంలోని పెద్దవాగు పరిసరాలలో ఈ మ్యాన్ ఈటర్ పెద్దపులి సంచరిస్తుంది. అడవిలోకి వెళ్ళవద్దని ఫారెస్ట్ అధికారులు హెచ్చరికలు చేస్తున్నారు. ఎవరు అడవుల వైపు ఒంటరిగా వెళ్ళవద్దని ఉదయం 9 నుండి సాయంత్రం 5 గంటల లోపే వ్యవసాయ, ఇతర పనులకు వెళ్ళాలని గ్రామాలలో ఫారెస్ట్ అధికారులు ప్రచారం చేస్తున్నారు.. ఇద్దరి చంపిన ఏ-2 మ్యాన్ ఈటర్ మళ్ళీ సంచరించడంతో పరిసర గ్రామల ప్రజలు భయాందోళనకుగురవుతున్నారు.
Also Read: గ్రామానికి రోడ్డు నిర్మించిన తర్వాతే పెళ్లి అంటూ ప్రతిజ్ఞ.. ఆ వాగ్ధాన్ని నెరవేర్చిన యువ సర్పంచ్..