ఎల్‌ఎండీ దిగువకు నీటి విడుదల

లోయ‌ర్ మానేరు డ్యాం నుంచి కాక‌తీయ కాలువ ద్వారా అధికారులు దిగువ‌కు నీటిని విడుద‌ల చేశారు. రైతుల వ్య‌వ‌సాయ అవ‌స‌రాల‌ నిమిత్తం చెరువులు, కుంట‌లు, ఇత‌ర నీటి వ‌న‌రుల‌ను నింపేందుకు 2,800 క్యూసెక్కులు, మిష‌న్ భ‌గీర‌థ త్రాగునీరు నిమిత్తం మ‌రో 300 క్యూసెక్కుల‌ నీటిని వ‌దిలారు...

ఎల్‌ఎండీ దిగువకు నీటి విడుదల
Follow us

|

Updated on: Aug 28, 2020 | 7:17 PM

లోయ‌ర్ మానేరు డ్యాం నుంచి కాక‌తీయ కాలువ ద్వారా అధికారులు దిగువ‌కు నీటిని విడుద‌ల చేశారు. రైతుల వ్య‌వ‌సాయ అవ‌స‌రాల‌ నిమిత్తం చెరువులు, కుంట‌లు, ఇత‌ర నీటి వ‌న‌రుల‌ను నింపేందుకు 2,800 క్యూసెక్కులు, మిష‌న్ భ‌గీర‌థ త్రాగునీరు నిమిత్తం మ‌రో 300 క్యూసెక్కుల‌ నీటిని వ‌దిలారు.

ప్రాజెక్టుకు 5,136 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొన‌సాగుతుండ‌గా 2,803 క్యూసెక్కులు ఔట్‌ఫ్లోగా ఉంది. డ్యాం పూర్తిస్థాయి నీటి సామ‌ర్థ్యం 24.034 టీఎంసీలు కాగా ప్ర‌స్తుత నీటి నిల్వ‌ 23.558 టీఎంసీలు. ఇటీవ‌ల కురిసిన వ‌ర్షాలు త‌గినంత నీటిని అందించ‌ని కార‌ణంగా రైతుల విజ్ఞ‌ప్తిపై ఎల్ఎండీ అధికారులు నీటిని వ‌దిలారు.

షెడ్యూల్‌కు ఒక నెల ముందే నీటిని విడుద‌ల చేయ‌డం ఈ మ‌ధ్య‌కాలంలో ఇదే తొలిసారి. సాధారణంగా ఇరిగేషన్, క్యాచ్‌మెంట్ ఏరియా డెవలప్మెంట్ సమావేశంలో నీటి కేటాయింపులను నిర్ణయించిన తరువాతే సెప్టెంబర్ చివర‌లో కాలువలోకి నీరు విడుదల అవుతుంది.