Telangana: జొన్న పంట కోయిస్తుండగా.. ఒక్కసారిగా చేనులో అలజడి.. ఏంటా అని చెక్ చేయగా షాక్

పంట బాగా పండింది. మంచి ముహూర్తం చూసి.. వాతావరణం బాగా ఉండటంతో శనివారం కోత మిషన్ సాయంతో.. పంటను కోయిస్తున్నారు. ఈ సమయంలో వారికి షాకింగ్ దృశ్యం కనిపించింది.

Telangana: జొన్న పంట కోయిస్తుండగా.. ఒక్కసారిగా చేనులో అలజడి.. ఏంటా అని చెక్ చేయగా షాక్
Telangana News
Follow us

|

Updated on: May 14, 2022 | 6:36 PM

Viral Video: ఆ రైతు వేసిన జొన్న పంట కోతకు వచ్చింది. దీంతో కోత మిషిన్(హర్వేస్టర్‌) తీసుకొచ్చి.. పంటను కోయిస్తున్నారు. ఈ లోపులో పొలంలో అలజడి చెలరేగింది. ఏదో జంతువు కదులుతున్నట్లు అనిపించింది. అడవి పందో, జింకో అనుకున్నారు వారు. కానీ అది చిరుత. దీంతో ఒక్కసారిగా అక్కడున్న వారు కంగుతిన్నారు. కూలీలు ప్రాణ భయంతో అరుస్తూ పరుగులు పెట్టారు. వారి అరుపులు విన్న చిరుత.. అక్కడి నుంచి పరుగులు తీసింది. హర్వెస్టర్‌ మిషిన్‌పై నుంచి పులిని వెంబడించగా.. భీంపూర్‌ మండలం గుబిడిపల్లి, వడ్‌గాం ప్రాంతంలోని అటవీప్రాంతంవైపు లగెత్తింది. ఆదిలాబాద్‌ జిల్లా(adilabad district) తాంసి మండలం(Tamsi Mandal) కప్పర్ల గ్రామ శివారులో ఈ ఘటన జరిగింది. చిరుత సంచారంతో సమీప గ్రామాల ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. వెంటనే  కప్పర్ల సర్పంచ్​ సదానందం అటవీ అధికారులకు సమాచారం అందించారు. చిరుత ఎటు వెళ్లిందో వివరాలు చెప్పారు.  వెంటనే ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ప్రేంసింగ్‌, బీట్‌ అధికారి శరత్‌రెడ్డి.. ఘటనాస్థలికి చేరుకున్నారు. చిరుత కనిపించిన పంట చేనులో గ్రామస్థులతో కలిసి గాలింపు చర్యలు చేపట్టారు. తాంసి, తలమడుగు, భీంపూర్‌ మండల పరిసరాల్లో ఏడాదిగా తిరుగుతున్న చిరుతపులి ఇదేనని వారు నిర్ధారించకున్నారు. గ్రామస్థులు, రైతులు ఆందోళన చెందవద్దని.. జనాలను చిరుత ఏమి అనదని.. దాన్ని బంధించేందుకు ఏర్పాట్లు చేస్తామని అధికారులు చెప్పారు. పంట చేనులో చిరుత లగెత్తిన విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి. ఇన్నాళ్లు ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన కొందరు రైతులు.. చిరుత కనిపించిందని చెప్పినా ఎవరూ పట్టించుకోలేదు. తాజాగా ఇప్పుడు కెమెరా కంట పడంటంతో భీతిల్లుతున్నారు.