Leopard attack: మేకల మంద పై దాడి చేసిన చిరుత.. భయాందోళనకు గురవుతున్న ప్రజలు..

ఇటీవల కాలంలో వన్య ప్రాణులు జనావాసంలోకి వస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం ఎల్లారెడ్డి పల్లి గ్రామంలో కొన్ని రోజులుగా చిరుతపులి సంచరిస్తుంది.

Leopard attack: మేకల మంద పై దాడి చేసిన చిరుత.. భయాందోళనకు గురవుతున్న ప్రజలు..
Leopard
Follow us

|

Updated on: Apr 11, 2021 | 3:54 PM

Leopard attack: ఇటీవల కాలంలో వన్య ప్రాణులు జనావాసంలోకి వస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం ఎల్లారెడ్డి పల్లి గ్రామంలో కొన్ని రోజులుగా చిరుతపులి సంచరిస్తుంది. చిరుతపులి సంచారం గ్రామస్తులను భయాందోళనకు గురిచేస్తుంది. గత మూడు రోజుల క్రితం చిరుత పులి దాడి చేసి మూడు మేకలు. ఒక పొట్టేలు పై చంపేసినట్లు యజమాని చంద్రయ్య తెలిపారు.

ఈ మేరకు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించగా అటవీశాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించి వెళ్ళిపోయారు. అటవీశాఖ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని గ్రామస్తులు ఆందోళన చేస్తున్నారు. చిరుతను పట్టుకోవాలని దానిని పట్టుకునేందుకు బోను ఏర్పాటు చేయాలని అటవీశాఖ అధికారులకు చెప్పిన పట్టించుకోవడం లేదని గ్రామస్థులు తెలిపారు. దాడి జరిగిన ప్రదేశం అటవి ప్రాంతంలో ఉందని గ్రామస్తులు ఎవరు అటువైపు వెళ్ళకూడదని అటవీ శాఖ అధికారులు సుచించారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

అధికారులు ఆదుకోకుంటే.. ఆత్మహత్యలే శరణం అంటున్న అన్నదాతలు.. కంట కన్నీరు పెట్టిస్తున్న కూరగాయల ధరలు

Tirupati By-Election: ప్రచార పర్వంలో సవాళ్ళ జోరు.. హీటెక్కుతున్న తిరుపతి ఉప ఎన్నిక.. సై అంటే సై

Avijit Ghosal: వెస్ట్ బెంగాల్ ఎన్నికల్లో ‘మాటువా’ ఓట్ల కోసం తృణమూల్, బీజేపీ పాకులాట..ఎవరీ మాటువాలు..వారి ఓట్లకు ఎందుకు అంత విలువ?