రెచ్చిపోయిన ల్యాండ్ మాఫియా.. కరీంనగర్‌లో దారుణం

కరీంనగర్‌లో ల్యాండ్ మాఫియా రెచ్చిపోయింది. ల్యాండ్ విషయంలో ఓ వ్యక్తిని రక్తం కారేలా చితక్కొట్టారు. తలపై బండరాళ్లతో మోదీ తీవ్రంగా గాయపరిచారు. అడ్డుకున్న బాధితుడి కుటుంబ సభ్యులను చితకబాదారు. ఆడపిల్ల అని కూడా చూడకుండా కాళ్లతో తన్నుతూ నానా బీభత్సం సృష్టించారు. ఈ ఘటనలో గాయపడిన స్థల యజమాని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. తలపై తీవ్రగాయాలు కావడంతో అతను అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. భరత్ నగర్‌లో నివాసముంటున్న శ్రీనివాస్ రెడ్డికి 266 గుంటల స్థలం ఉంది. […]

రెచ్చిపోయిన ల్యాండ్ మాఫియా.. కరీంనగర్‌లో దారుణం
Follow us

| Edited By:

Updated on: Apr 26, 2019 | 1:06 PM

కరీంనగర్‌లో ల్యాండ్ మాఫియా రెచ్చిపోయింది. ల్యాండ్ విషయంలో ఓ వ్యక్తిని రక్తం కారేలా చితక్కొట్టారు. తలపై బండరాళ్లతో మోదీ తీవ్రంగా గాయపరిచారు. అడ్డుకున్న బాధితుడి కుటుంబ సభ్యులను చితకబాదారు. ఆడపిల్ల అని కూడా చూడకుండా కాళ్లతో తన్నుతూ నానా బీభత్సం సృష్టించారు. ఈ ఘటనలో గాయపడిన స్థల యజమాని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. తలపై తీవ్రగాయాలు కావడంతో అతను అపస్మారక స్థితిలోకి వెళ్లాడు.

భరత్ నగర్‌లో నివాసముంటున్న శ్రీనివాస్ రెడ్డికి 266 గుంటల స్థలం ఉంది. దాదాపు 30ఏళ్ల కిందట రిజిస్టర్ చేసుకున్నాడు. వారం కిందట ఈ స్థలం చుట్టూ ప్రహరీ గోడ కట్టుకునేందుకు సామాగ్రిని తెచ్చుకున్నారు. అయితే ఈ స్థలం తమదంటూ స్థానికంగా ఉండే సర్దార్ రాజ్దీర్ సింగ్, రాపోలు శంకర్, యస్పాల్ సింగ్, బొంతల ప్రవీణ్ అనే వ్యక్తులు వాగ్వాదానికి దిగారు. దీంతో షాక్ తిన్న శ్రీనివాస్ రెడ్డి వారితో వాగ్వాదానికి దిగారు. దొంగ రిజిస్టర్ చేసుకుని తమ భూమిని లాక్కునే ప్రయత్నం చేస్తున్నారంటూ శ్రీనివాస్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇరు వర్గాల మధ్య మాటా మాటా పెరిగింది. దీంతో ల్యాండ్ మాఫియాలోని ఓ వ్యక్తి ఒక్కసారిగా రెచ్చిపోయాడు. అక్కడే ఉన్న కలుపు పారతో స్థల యజమాని తలపై గట్టిగా మోదాడు. అడ్డొచ్చిన యజమాని కుటుంబ సభ్యులను చితకబాదాడు.

తన తండ్రిపై దాడి చేస్తున్న వ్యక్తులను అడ్డుకునేందుకు బాధితుడి కూతురు ప్రయత్నించింది. అయినా ఆడపిల్ల అని చూడకుండా ఆ యువతిని కూడా చితకబాదారు. కాళ్లతో తన్నుతూ తమ రాక్షసత్వాన్ని ప్రదర్శించారు. అక్కడున్న వారు అడ్డుకుని.. బాధితుడిని వెంటనే స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. కరీంనగర్ జిల్లాలో గత కొంతకాలంగా భూ మాఫియా ఆగడాలకు అదుపు లేకుండా పోతోంది. దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలని.. బాధితులు కోరుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.

దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!