Land Doctor: గూగుల్ లొకేషన్ ఇస్తే.. 15 నిమిషాల్లో భూ వివరాలు మీ చేతికి..

Land Doctor: భూముల విషయంలో మోసాలు జరగటం మనం చాలాసార్లు చూస్తుంటాం. ప్రతి రోజూ వేలల్లో జరిగే భూ క్రయవిక్రయాల్లో(Land Deals) చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉంటారు.

Land Doctor: గూగుల్ లొకేషన్ ఇస్తే.. 15 నిమిషాల్లో భూ వివరాలు మీ చేతికి..
Land
Follow us

|

Updated on: Mar 22, 2022 | 1:48 PM

Land Doctor: భూముల విషయంలో మోసాలు జరగటం మనం చాలాసార్లు చూస్తుంటాం. ప్రతి రోజూ వేలల్లో జరిగే భూ క్రయవిక్రయాల్లో(Land Deals) చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉంటారు. చాలాసార్లు భూయాజమాని, మధ్యవర్తి చెప్పే మాటలు నమ్మి ముందడుగు వేస్తుంటారు. కొనాలనుకుంటున్న స్థిరాస్తికి సంబంధించి ముందే విచారిస్తే వాస్తవాలు తెలిసే అవకాశం ఉన్నా.. అందుకు రోజుల తరబడి ప్రభుత్వ కార్యాలయాల(Government Offices) చుట్టూ తిరగాల్సి వస్తుంది. చాలా మంది వాటన్నింటినీ కలెక్ట్ చేసేందుకు సమయం కుదరక, ఇతర కారణాలతో విక్రయదారుల మాటలు నమ్మి ముందుగా అడ్వాన్స్ సొమ్ము చెల్లిస్తుంటారు. అలా చెల్లించి డబ్బు నష్టపోయేవారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. బఫర్‌ జోన్‌లో ఉన్న స్థలాలను, ట్రిఫుల్‌ వన్‌లో ఉన్న స్థలాలను.. హెచ్‌ఎండీఏ, డీటీసీపీ అనుమతి ఉందని చెప్పి లేని లేఅవుట్‌లో ప్లాట్‌ అమ్మడం వరకు వాస్తవాలను దాచి విక్రయిస్తుంటారు. ఇవేకాకుండా మరెన్నో వివాదాలు భూముల చుట్టూ తిరుగుతుంటాయి. కోర్టు కేసుల్లో నలుగుతుంటాయి. హైదరాబాద్‌లో అయితే ఇనామ్‌ భూములని, సీలింగ్‌ భూములని.. రకరకాల పేర్లతో ఉన్నాయి. ఇలాంటి మోసాల నుంచి తప్పించుకోవటానికి సదరు ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవటం ఉత్తమం అంటారు ల్యాండ్‌ డాక్టర్‌ స్టార్టప్ వ్యవస్థాపకులు కార్తీక్‌రెడ్డి. చాలా మంది తమ జీవిత కాలంలో చాలా తక్కువ సార్లు ఆస్తుల కొనుగోలు చేస్తుంటారని.. అందువల్ల అవగాహన లేని వారు ఎక్కువగా ఉంటారని ఆయన అంటున్నారు.

15 నిమిషాల్లో ఫుల్ డీటెయిల్స్..

ఈ సంస్థ ప్రత్యేకత ఏమిటంటే.. కొనబోయే స్థిరాస్తికి సంబంధించి ప్రభుత్వ రికార్డుల్లోని సమాచారాన్ని నిమిషాల్లో అందిస్తుంది. ఇందుకోసం కేవలం కొనుగోలుదారు గూగుల్‌ లొకేషన్‌ పంపిస్తే చాలు. ఆ భూమి ఉన్న సర్వే నంబరు, ఏ జోన్‌లో ఉంది,  ఎవరి పేరున ఉంది? కోర్టు కేసులేమైనా ఉన్నాయా? మాస్టర్‌ప్లాన్‌లో ప్రతిపాదిత 100 అడుగుల రోడ్డు వెళుతుందా? ప్రభుత్వ మార్కెట్‌ విలువ ఎంత ఉంది? ఇలా సమగ్ర సమాచారంతో కూడిన నివేదికను సంస్థ కేవలం పదిహేను నిమిషాల్లోనే అందిస్తోంది.

16 సంవత్సరాలుగా స్థిరాస్తి కన్సల్టెన్సీ సేవల్లో ఉన్నందున ఎదురయ్యే అనేక సమస్యలకు పరిష్కారాలు అందించేందుకు దీనిని ప్రారంభించినట్లు కార్తీక్‌రెడ్డి అంటున్నారు. ఈ ఆలోచనతో ఆరునెలల కిందట ల్యాండ్‌ డాక్టర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వెల్లడించారు. ఈ తరహా సేవలు అందిస్తున్న మొట్టమొదటి సంస్థ ఇదేనని సంస్థ చెబుతోంది. చాలా మంది తమ సేవలను వినియోగించుకుంటున్నారని.. ఇందుకోసం 22 మంది సభ్యుల బృందం పనిచేస్తోందని ఆయన స్పష్టం చేశారు.

ఇవీ చదవండి..

Market News: భారత మార్కెట్లు చతికిల పడ్డాయా..? వారం ప్రారంభం నుంచి మళ్లీ నష్టాల్లోకి..

Buying House: ఇల్లు కొంటున్నారా.. దానికి ముందు లీగల్ ఒపీనియన్ తీసుకోకపోతే ఏమవుతుందో తెలుసా..

House: ఇల్లు కొనుగోలు చేస్తున్నారా.. అయితే ఈ డాక్యుమెంట్లు ఉన్నాయో లేదో చూసుకోండి..

'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
‘ఎవరెస్ట్‌ మసాలా’లో పురుగు మందులు.. రీకాల్‌ చేయాలని ఆదేశాలు
‘ఎవరెస్ట్‌ మసాలా’లో పురుగు మందులు.. రీకాల్‌ చేయాలని ఆదేశాలు
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.
బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..
బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..
ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..
ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..
చరణ్‌కు రూ.70 కోట్లు, NTRకి రూ.50 కోట్లు | మహేష్‌ న్యూ లుక్.
చరణ్‌కు రూ.70 కోట్లు, NTRకి రూ.50 కోట్లు | మహేష్‌ న్యూ లుక్.
సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?