KTR Twitter: కేటీఆర్‌ కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ వెనక ఉన్న రహస్యమేంటో తెలుసా.? ఆసక్తికర జవాబు చెప్పిన తారక రామరావు..

KTR Twitter: ఒకప్పుడు రాజకీయ నాయకులకు, ఇప్పటి నేతల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. మారుతోన్న కాలానికి అనుగుణంగా తాము మారుతూ ప్రజల్లోకి వెళుతున్నారు కొందరు పొలిటిషియన్స్‌. వీరిలో ముందు వరుసలో ఉంటారు.. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి...

  • Narender Vaitla
  • Publish Date - 4:49 pm, Mon, 12 April 21
KTR Twitter: కేటీఆర్‌ కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ వెనక ఉన్న రహస్యమేంటో తెలుసా.? ఆసక్తికర జవాబు చెప్పిన తారక రామరావు..
Ktr Twitter

KTR Twitter: ఒకప్పుడు రాజకీయ నాయకులకు, ఇప్పటి నేతల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. మారుతోన్న కాలానికి అనుగుణంగా తాము మారుతూ ప్రజల్లోకి వెళుతున్నారు కొందరు పొలిటిషియన్స్‌. వీరిలో ముందు వరుసలో ఉంటారు.. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామరావు. సోషల్‌ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉండే మంత్రి ఎవరైనా అవసరం కోసం ఆర్జిస్తే వెంటనే సమాధానం ఇస్తారు. ఎవరైనా విమర్శిస్తే అంతే ఘాటూగా స్పందిస్తారు. ఇలా రాజకీయాల్లో సరికొత్త ఒరవడికి శ్రీకారం చూడుతూ నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తున్నారు మంత్రి కేటీఆర్‌. సోషల్‌ మీడియాలో ఇప్పటి వరకు సినిమా సెలబ్రిటీలు ఫ్యాన్స్‌తో ఇంట్రాక్ట్‌ అవుతూ వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తుంటారు. కానీ రాజకీయ నాయకులు కూడా ఇలా చేయొచ్చని నిరూపించారు మంత్రి. తాజాగా ట్విట్టర్‌ వేదికగా ప్రజలతో సంభాషించారు. #AskKTR పేరుతో ఆయన ముచ్చటించారు. ఈ సందర్భంగా కొందరు నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు.
‘సర్‌.. మీ కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ అద్భుతం. రహస్యం ఏంటి? మాకు ఏదైనా సలహా ఇస్తారా.?’ అని ఓ వ్యక్తి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ… ‘ఆలోచనల్లో స్పష్టత ఉన్నప్పుడే మనం చక్కగా భావవ్యక్తీకరణ చేయగలం. ఎప్పటికప్పుడు పదాలను నేర్చుకునేందుకు ప్రయత్నించండి’ అంటూ ట్వీట్‌ చేశారు. ఇక మరో వ్యక్తి కేటీఆర్‌ యంగ్‌ ఏజ్‌లో ఉన్నప్పుడు దిగిన ఫొటోను పోస్ట్‌ చేస్తూ.. ‘కేటీఆర్‌ సర్‌.. మీరు హీరోలా ఉన్నారు. బాలీవుడ్‌, హాలీవుడ్‌ సినిమాల్లో ఎప్పుడూ ప్రయత్నించలేదా?’ అన్న ప్రశ్నకు కేటీఆర్‌ ఫన్నీగా స్పందిస్తూ.. ‘బాలీవుడ్‌, హాలీవుడ్‌, మరీ పెద్ద చెట్టు ఎక్కిస్తున్నావ్‌’ అంటూ నవ్వుతున్న ఎమోజీని కామెంట్‌లో జత చేశారు. ఇక తన అభిమాన క్రికెటర్‌ ఒకప్పుడు ద్రవిడ్‌ అని.. ఇప్పుడు విరాట్‌ కోహ్లి అని చెప్పుకొచ్చారు మంత్రి. ఇక సిద్ధిపేట తెలంగాణలో ఉత్తమ పట్టణాల్లో ఒకటని చెప్పిన కేటీఆర్‌.. తెలంగాణలో మళ్లీ లాక్‌డౌన్‌ ఉంటుందా.? అన్న ప్రశ్నకు.. ‘అది మంచి ఆలోచన కాదని నా అభిప్రాయం’ అంటూ చెప్పుకొచ్చారు. ఇక సినిమాలు ఎక్కువగా చూసే మంత్రి.. జాతిరత్నాలు ఎలా ఉందన్న ప్రశ్నకు.. ‘చాలా బాగా నచ్చింది. పూర్తి హాస్యభరిత చిత్రం’ అంటూ కామెంట్‌ చేశారు.

సినిమాల్లో ప్రయత్నించలేదా అంటూ ఓ నెటిజన్ చేసిన ట్వీట్..

Also Read: Hyderabad Rain: హైదరాబాద్‌లో పలుచోట్ల వర్షం.. చిరుజల్లులతో చల్లబడ్డ భాగ్యనగరం

Singireddy Niranjan Reddy: తెలంగాణలో మరో మంత్రికి కరోనా పాజిటివ్.. ఆ జిల్లా నాయకుల్లో టెన్షన్

Viral Video : మద్యం మత్తులో రోడ్డుపైకొచ్చిన పాదాచారుడు.. ఏం జరిగిందో తెలియాలంటే ఈ వీడియో చూడాల్సిందే..