Munugode Bypoll: మునుగోడులో వారిదే పైచేయి.. నిర్ణయాత్మక శక్తిగా నిలువనున్న ఆ వర్గాలు.. ఆసక్తికర గణాంకాలు మీకోసం..

మునుగోడు ఉప ఎన్నికను అధికార పార్టీ టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు సవాల్‌గా తీసుకున్నాయి. ఇక్కడ త్రిముఖ పోటీ నెలకొనే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మునుగోడులో ఓటర్లు ఎందరున్నారు..?

Munugode Bypoll: మునుగోడులో వారిదే పైచేయి.. నిర్ణయాత్మక శక్తిగా నిలువనున్న ఆ వర్గాలు.. ఆసక్తికర గణాంకాలు మీకోసం..
Munugode Bypoll
Shaik Madarsaheb

|

Oct 07, 2022 | 6:24 PM

మునుగోడు ఉప ఎన్నిక సందడి మొదలైంది. నోటిపికేషన్ విడుదల కావడంతో శుక్రవారం నుంచి నామినేషన్ల సందడి మొదలైంది. ఇవాళ్టి నుంచి 14 వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. నల్గొండ కలెక్టర్‌ వినయ్‌ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఉప ఎన్నికకు ఏర్పాట్లు పూర్తి చేశారు. చండూరు మండల ఆఫీసులో నామినేషన్లను స్వీకరిస్తున్నారు. రిటర్నింగ్‌ అధికారిగా స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ జగన్నాథరావును వ్యవహరిస్తున్నారు. నామినేషన్లపై సందేహాలు తీర్చేందుకు హెల్ప్‌ డెస్క్‌ ఏర్పాటు చేశారు. నామినేషన్ల ప్రక్రియను వీడియో షూట్‌ కూడా చేస్తున్నారు. కాగా.. తొలిరోజు రెండు నామినేషన్లు దాఖలయ్యాయి. కాగా.. నామినేషన్ల దాఖలు అనంతరం నామినేషన్ల పరిశీలన- అక్టోబర్‌ 15 ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు అక్టోబర్‌ 17తో ముగుస్తుంది. ఎన్నికల పోలింగ్ నవంబర్‌ 3న జరగనుంది. ఓట్ల లెక్కింపు నవంబర్‌ 6 జరుగుతుంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా మునుగోడు ఉప ఎన్నిక చర్చనీయాంశంగా మారింది.

మునుగోడు ఉప ఎన్నికను అధికార పార్టీ టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు సవాల్‌గా తీసుకున్నాయి. ఇక్కడ త్రిముఖ పోటీ నెలకొనే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మునుగోడులో ఓటర్లు ఎందరున్నారు..? సామాజిక వర్గాల వారీగా ఎవరికీ ఎన్ని ఓట్లు ఉన్నాయి.. గతంలో గెలిచిన అభ్యర్థులెవరు ఇలాంటి ఆసక్తికరమైన వివరాలను తెలుసుకుందాం..

మునుగోడులో గతంలో గెలిచిన అభ్యర్థులు వీరే..

మునుగోడు అసెంబ్లీ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు 12 సార్లు ఎన్నికలు జరిగాయి. వీటిలో 9 సార్లు రెడ్డి, 3 సార్లు వెలమ సామాజికవర్గం నేతలు గెలుపు సాధించారు.

  • 2018 కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి – కాంగ్రెస్
  • 2014 కె. ప్రభాకర్‌రెడ్డి – టీఆర్‌ఎస్‌
  • 2009 యు. యాదగిరిరావు – సీపీఐ (వెలమ)
  • 2004 పల్లా వెంకట్‌రెడ్డి – సీపీఐ
  • 1999 పాల్వాయి గోవర్ధనరెడ్డి – కాంగ్రెస్‌
  • 1994 యు. నారాయణరావు – సీపీఐ (వెలమ)
  • 1989 యు. నారాయణరావు – సీపీఐ ( వెలమ)
  • 1985 యు. నారాయణరావు – సీపీఐ
  • 1983 పాల్వాయి గోవర్ధనరెడ్డి – కాంగ్రెస్
  • 1978 పాల్వాయి గోవర్ధనరెడ్డి – కాంగ్రెస్
  • 1972 పాల్వాయి గోవర్ధనరెడ్డి – కాంగ్రెస్‌
  • 1967 పాల్వాయి గోవర్ధనరెడ్డి – కాంగ్రెస్‌

మునుగోడు అసెంబ్లీలో ఓటర్ల వివరాలు..

⁍ మొత్తం 2,27,267

⁍ పురుషులు-1,15,625

⁍ మహిళలు-1,11,637

⁍ ట్రాన్స్ జెండర్లు-05

⁍ మొత్తం ఓటర్లలో కొత్తగా నమోదైన వారు-20,181

మునుగోడులో సామాజికవర్గాలు – ఓటుశాతం

మొత్తం ఓటర్లు – 2లక్షల 27వేల 101

ఇవి కూడా చదవండి

  • బీసీలు – 1,50,400 (66.2 శాతం)
  • ఎస్సీలు – 35,411 (15.6 శాతం)
  • ఓసీలు – 20,290 (8.9 శాతం)
  • ఎస్టీలు – 13000 (5.7 శాతం)
  • మైనారిటీలు- 8000 (3.5 శాతం)

బీసీల్లో కులాల వారీగా.. 

  • గౌడ – 38,000 (16.7)
  • గొల్ల, కురుమ -35,000 (15.4)
  • ముదిరాజ్ -34,500 (15.2)
  • పద్మశాలి -19,000 (8.4)
  • వడ్డెర -8300 (3.6)
  • విశ్వ బ్రాహ్మణ -7800 (3.4)
  • కుమ్మరి -7800 (3.4)

ఎస్సీలలో..

  • మాదిగ -25000 (11.0)
  • మాల -10411 (4.6)

ఓసీలలో

  • రెడ్డి – 7701 (3.3)
  • కమ్మ -4,880 (2.1)
  • వెలమ -2,360 (1.0)
  • వైశ్య -3760 (1.6)
  • ఇతరులు- 1, 589 (0.9)

మరిన్ని తెలంగాణ వార్తల కోసం.. 

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu