Telangana: తెలంగాణాలో ఆ ప్రాంతాన్ని పీడిస్తున్న కిడ్నీ వ్యాధి.. రోజు రోజుకీ పెరుగుతన్న బాధితుల సంఖ్య

నేలకొండపల్లి మండలం చెన్నారం, బోదుల బండ, రాజేశ్వర పురం,చెరువు మాదారం గ్రామాల్లో పదుల సంఖ్యలో క్యాన్సర్ బాధితులు ఉన్నారు.. ఒక్క చెన్నారం లోనే 50 కేసులు పైగా ఉన్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు..

Telangana: తెలంగాణాలో ఆ ప్రాంతాన్ని పీడిస్తున్న కిడ్నీ వ్యాధి.. రోజు రోజుకీ పెరుగుతన్న బాధితుల సంఖ్య
Kidney Disease In Khammam D
Follow us

|

Updated on: Aug 04, 2022 | 9:32 PM

Telangana: ఆ ప్రాంతాన్ని క్యాన్సర్ పట్టి పీడిస్తోంది.. లక్షలు ఖర్చుపెట్టి.. వైద్యం చేయించుకునే స్థోమత లేని పేదలు క్యాన్సర్ రక్కసి కి బలై పోతున్నారు.. ప్రభుత్వం వెంటనే స్పందించి నివారణ చర్యలు చేపట్టి.. ఆదుకోవాలని కోరుతున్నారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం లో పలు ప్రాంతాల్లో క్యాన్సర్ మహమ్మారి పెను భూతము లా విస్తరిస్తోంది.. చెన్నారం, బోదులబండ, రాజేశ్వర పురం, చెరువు మాధారం గ్రామాల్లో పదుల సంఖ్యలో క్యాన్సర్ బాధితులున్నారు. ఒక్క చెన్నారం గ్రామంలో నే 50 పైగా కేసులు ఉన్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.. ఈ ప్రాంతాన్ని పీడిస్తున్న క్యాన్సర్ మహమ్మారి రోజు రోజుకు విస్తరిస్తోంది.. స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.. ప్రారంభ దశలో గుర్తిస్తే ..చికిత్స తీసుకోవచ్చు.. కానీ బయట పడని, గుర్తించని కేసులు రెట్టింపు ఉంటాయని అనుమానం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు.

ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో నే క్యాన్సర్ విస్తరిస్తోంది.. దీనికి కారణాలు ఏంటని.. అర్థం కావడం లేదు.. చుట్టుపక్కల ఉన్న కెమికల్స్ ఫ్యాక్ట రీ, వ్యర్థాలు, వాయు కాలుష్యం వలన క్యాన్సర్ బారిన పడుతున్నారనే అనుమానం బాధితులు వ్యక్తం చేస్తున్నారు.. గర్భాశయ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, వివిధ రకాలుగా సోకుతోంది.. వ్యాధి ముదిరి బయట పడే సమయానికి.. హైదరాబాద్ హాస్పిటల్స్ కు పరుగులు పెడుతున్నారు.. లక్షలు పెట్టి వైద్యం చేయించుకునే స్థోమత లేకపోవడంతో.. రెండు సంవత్సరాల్లో 15 మంది పైగా క్యాన్సర్ మహమ్మారి కి బలయ్యారు.. కొందరు ఇంటి పెద్ద దిక్కున కోల్పోయారు.. ఏ అలవాటు లేని నరసింహారావు అనే 32 సంవత్సరాల వ్యక్తి క్యాన్సర్ బారిన పడి మృతి చెందారు..దీనితో భార్య, ఇద్దరు పిల్లలు అనాదులయ్యారు..

చెన్నారం గ్రామం ఎస్సి కాలనీ లో పక్క పక్క కుటుంబాల్లో వారికి ప్రతి ఇంట్లో బాధితులు ఉన్నారు.. కొందరు ఆస్తులు, భూములు అమ్మి చికిత్స తీసుకున్నా..ఫలితం దక్కలేదు.. ఈ ప్రాంతంలో టెస్టులు చేస్తే ఎక్కువ సంఖ్యలో బాధితులు ఉంటారని స్థానికులు అంటున్నారు కొందరు తొలుత సాదారణ జ్వరం, ఇతరత్రా అనారోగ్య సమస్యలని భావించి చికిత్స తీసుకుంటున్నారు.. తగ్గక పోవడం తో హైదరాబాద్ పెద్ద హాస్పిటల్స్ కు వెళుతున్నారు.ఆర్థిక స్థోమత లేని పేదలు సరైన చికిత్స అందక ప్రాణాలు కోల్పోతున్నారు.. ప్రభుత్వం వెంటనే క్యాన్సర్ నివారణ చర్యలు చేపట్టి.. బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి

Reporter : Narayana, Tv9 Telugu మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!