Khammam: ఆయనొక పార్ట్‌ టైమ్‌ పొలిటీషియన్‌.. కాంగ్రెస్ ఎమ్మెల్యేపై రేగా కాంతారావు హాట్‌ కామెంట్స్‌..

అసెంబ్లీ ఎన్నికలకు పది నెలల ముందే ఉమ్మడి ఖమ్మం హీటెక్కిపోతోంది. ఆత్మీయ సమ్మేళనాలతో పొంగులేటి ప్రకంపనలు సృష్టిస్తుంటే, బీఆర్‌ఎస్‌ అందుకు దీటుగా రాజకీయం నడుపుతోంది.

Khammam: ఆయనొక పార్ట్‌ టైమ్‌ పొలిటీషియన్‌.. కాంగ్రెస్ ఎమ్మెల్యేపై రేగా కాంతారావు హాట్‌ కామెంట్స్‌..
Khammam Politics
Follow us

|

Updated on: Feb 02, 2023 | 7:32 AM

అసెంబ్లీ ఎన్నికలకు పది నెలల ముందే ఉమ్మడి ఖమ్మం హీటెక్కిపోతోంది. ఆత్మీయ సమ్మేళనాలతో పొంగులేటి ప్రకంపనలు సృష్టిస్తుంటే, బీఆర్‌ఎస్‌ అందుకు దీటుగా రాజకీయం నడుపుతోంది. ఈసారి ఎలాగైనా పదికి పది సీట్లు గెలవడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు గులాబీ నేతలు. అయితే, ఉమ్మడి ఖమ్మంలో తమాషా రాజకీయాలు నడుస్తున్నాయంటోన్న BRS ఎమ్మెల్యే రేగా కాంతారావు మరోసారి పవర్‌ఫుల్‌ డైలాగ్స్‌ వదిలారు. BRS ఎమ్మెల్యే రేగా కాంతారావు ఈసారి భద్రాచలం MLA పోదెం వీరయ్యను టార్గెట్‌ చేశారు. ఆయనో పార్ట్‌ టైమ్‌ పొలిటీషియన్‌ అన్నారు. పండక్కి అల్లుడొచ్చినట్లు.. నియోజకవర్గానికి వచ్చి వెళ్తుంటాడన్నారు రేగా.

ఆత్మీయ సమ్మేళనాలతో ఉమ్మడి ఖమ్మం మొత్తం రాజకీయ ప్రకంపనలు రేపుతోన్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిపై ఇన్‌డైరెక్ట్‌ కామెంట్స్‌ చేశారు రేగా. డబ్బు మదంతో విర్రవీగుతున్నారని అన్నారు. దమ్ముంటే BRSకి రాజీనామాచేసి మీ బలమేంటో నిరూపించుకోవాలని సవాల్‌ విసిరారు. BRSని కాదంటే.. పొంగులేటి వెంట నడిచేవాళ్లు ఒక్కరు కూడా ఉండరన్నారు రేగా.

ఎవరెన్ని డ్రామాలేసినా ఉమ్మడి ఖమ్మంలోని పదికి పది సీట్లను బీఆర్ఎస్‌ కైవసం చేసుకుంటుందన్నారు రేగా కాంతారావు. గత రెండు ఎన్నికల్లో పార్టీ నష్టపోయింది. ఖమ్మంలో ఆశించిన ఫలితాలు సాధించలేకపోయింది. కానీ, ఈసారి అలా జరగదంటున్నారు రేగా. గులాబీ సైనికులు కసితో ఉన్నారని, ఈసారి ఉమ్మడి ఖమ్మంలో ప్రతి చోటా బీఆర్ఎస్‌ జెండా ఎగురుతీరుతుందని దీమాగా చెబుతున్నారు రేగా కాంతారావు. మరి, రేగా అంచనాలు నిజమవుతాయా?. ఒకవైపు పొంగులేటి అసమ్మతి, మరోవైపు కాంగ్రెస్‌, ఇంకోవైపు బీజేపీ, YSRTPని తట్టుకుని ఉమ్మడి ఖమ్మం మొత్తం గులాబీ పార్టీ జెండా ఎగరేయగలుతుందా? లేదో? చూడాలి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
26 రోజులుగా మెగాస్టార్ అదే పని మీద ఉన్నారా.? ఇంటర్వెల్ బాంగ్..
26 రోజులుగా మెగాస్టార్ అదే పని మీద ఉన్నారా.? ఇంటర్వెల్ బాంగ్..