KCR Strategy: కేసీఆర్ వ్యూహాత్మక అడుగులు.. వైజాగ్ బహిరంగ సభ తర్వాత ఢిల్లీ వేదికగా మరింత దూకుడు!

నాందేడ్ సభ నిర్వహణ తేదీని దాదాపు నెల రోజుల క్రితమే ప్రకటించినా.. సభ జరుగుతుందా ? వాయిదా పడుతుందా? లేక నాందెడ్ కంటే ముందే ఏపీలో సభ నిర్వహిస్తారా అన్న అంశాలు తరచూ మీడియాలో కనిపించాయి.

KCR Strategy: కేసీఆర్ వ్యూహాత్మక అడుగులు.. వైజాగ్ బహిరంగ సభ తర్వాత ఢిల్లీ వేదికగా మరింత దూకుడు!
KCR National Politics
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Feb 06, 2023 | 9:15 PM

భారత రాష్ట్ర సమితిగా మారిన తర్వాత గులాబీ దండు తొలుత ఏ రాష్ట్రంలో అడుగుపెడుతుంది అన్న అంశానికి ఫిబ్రవరి 5వ తేదీన తెరపడింది. అక్టోబర్ 5వ తేదీన విజయదశిమి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సమితి చరిత్రలో కలిసిపోయి.. భారత రాష్ట్ర సమితిగా జాతీయ పార్టీగా ఆవిర్భవించింది. అయితే ఆనాటి తీర్మానం తర్వాత జరగాల్సిన తంతు మిగిలి వుండడంతో దాదాపు రెండు నెలల పాటు ఫార్మాలిటీస్‌పైనే కేసీఆర్ ఫోకస్ చేశారు. ఆ తంతు పూర్తయి.. కేంద్ర ఎన్నికల సంఘం బీఆర్ఎస్‌ను జాతీయ పార్టీగా గుర్తించిన తర్వాత ముందుగా ఏ రాష్ట్రంలో కేసీఆర్ అడుగు పెడతారన్న చర్చ చాలా రోజులే కొనసాగింది. ఏపీ నుంచి పొలిటీషియన్లుగా మారిన మాజీ అధికారులు తోట చంద్రశేఖర్, రావెల కిశోర్ బాబు వంటి వారు కేసీఆర్ పార్టీలో చేరారు. చేరిన వెంటనే తోట చంద్రశేఖర్‌ను ఏపీ యూనిట్ ప్రెసిడెంటుగా కేసీఆర్ ప్రకటించారు. అదే క్రమంలో మహారాష్ట్ర నుంచి కొందరు, ఒడిశా నుంచి ఇంకొందరు వచ్చి బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఒడిశా నుంచి ఏకంగా ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గొమాంగో వచ్చి చేరారు. వెంటనే ఒడిశా బీఆర్ఎస్ అధ్యక్షునిగా ఆయన్ను ఎంచుకున్నారు కేసీఆర్. ఈక్రమంలోనే ఖమ్మం బహిరంగ సభకు ప్లాన్ చేశారు. ఖమ్మం జిల్లాలో నిర్వహించిన భారీ బహిరంగ సభ సక్సెస్ అవడంతో తదుపరి సభ ఎక్కడ అన్న చర్చ మొదలైంది. ముందుగా ఏపీలోనే బీఆర్ఎస్ మలి సభ వుంటుందని చాలా మంది భావించారు. విజయవాడ అని తొలుత.. విశాఖ పట్నం అని తరువాత బీఆర్ఎస్ రెండో సభ జరిగే నగరాల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. ఇదే సమయంలో మహారాష్ట్రలోను సభ నిర్వహించాలన్న యోచన చేశారు కేసీఆర్. తెలుగు వారు.. మరీ ముఖ్యంగా తెలంగాణవారు ఎక్కువ సంఖ్యలో వుండే గడ్చిరోలిలో సభ జరుపుతారని అనుకున్నారు. కానీ గడ్చిరోలి ప్రాంతం మావోయిస్టుల ప్రభావిత ప్రాంతం కావడంతో ఆ ఆలోచన మానుకున్నారు. నిజామాబాద్ జిల్లాకు పొరుగున మహారాష్ట్రలో వున్న నాందేడ్ పట్టణాన్ని బీఆర్ఎస్ పార్టీ మలి సభకు వేదికగా ఎంపిక చేశారు. నాందేడ్ సభ నిర్వహణ తేదీని దాదాపు నెల రోజుల క్రితమే ప్రకటించినా.. సభ జరుగుతుందా ? వాయిదా పడుతుందా? లేక నాందెడ్ కంటే ముందే ఏపీలో సభ నిర్వహిస్తారా అన్న అంశాలు తరచూ మీడియాలో కనిపించాయి. మరోవైపు నూతనంగా నిర్మించిన తెలంగాణ సచివాలయ ప్రారంభానికి కూడా రోజులు దగ్గరవుతున్నాయి. ఈక్రమంలో కేసీఆర్ వ్యూహం ఎలా వుంటుందన్న అంశం ఆసక్తి రేపింది. ఫిబ్రవరి 17వ తేదీన కేసీఆర్ తన పుట్టిన రోజునే సెక్రటేరియట్ కొత్త బిల్డింగుని ప్రారంభిస్తారని, నెలాఖరులో అసెంబ్లీని రద్దు చేసి.. ఎన్నికలకు వెళతారని ప్రచారం జరిగింది. కేసీఆర్ అంతరంగా ఎలా వుందోకానీ.. ఇంతలో మరో ప్రచారం మొదలైంది.

ఫిబ్రవరి నెలాఖరులో అసెంబ్లీని గనక రద్దు చేస్తే కేంద్ర ప్రభుత్వం వెంటనే తెలంగాణలో రాష్ట్రపతి పాలన విధిస్తుందని టీపీసీసీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఉత్తమ్ కుమార్ మాటలు సహజంగానే అందరిలోను ఆసక్తి రేపాయి. నిజానికి గత సంవత్సరం అంటే దాదాపు ఏడాది ముందుగానే అసెంబ్లీ రద్దుకు కేసీఆర్ రెడీ అయ్యారని కథనాలు వచ్చాయి. అయితే, 2018లో మాదిరిగా కాకుండా ఈసారి కేంద్రంలో వున్న బీజేపీ నేతలు చక్రం తిప్పుతారని, రాష్ట్రంలో ప్రెసిడెంటు రూల్ పెట్టడం ద్వారా అసెంబ్లీ ఎన్నికలను వచ్చే సార్వత్రిక ఎన్నికల దాకా సాగదీస్తారని ప్రచారం జరిగింది. ఈ ప్రచారంతో వెనక్కి తగ్గారో లేక జాతీయ పార్టీగా మార్చిన తర్వాతనే ఎన్నికలకు వెళ్ళాలి అనుకున్నారో ఏమో గానీ తమ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సచివాలయం, అమరవీరుల స్థూపం, అంబేద్కర్ విగ్రహం ప్రాజెక్టులను ప్రారంభించిన తర్వాతే అసెంబ్లీ రద్దుపై కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారని బీఆర్ఎస్ పార్టీ వర్గాలు చెప్పుకోవడం మొదలైంది. డిసెంబర్ 9వ తేదీన హైదరాబాద్ ఎయిర్‌పోర్టు మెట్రోకు కేసీఆర్ శంకుస్థాపన చేశారు. సర్వే పనులు కూడా పూర్తికాకుండానే ఎయిర్ పోర్టు మెట్రోకు 6,250 కోట్లు కేటాయిస్తున్నట్లు కేసీఆర్ వెల్లడించారు. ఇపుడు రెండు నెలలుగా ఎయిర్‌పోర్టు మెట్రో సర్వే పనులు సాగుతున్నాయి. కొత్త సచివాలయం, అమరవీరుల స్థూపం, అంబేద్కర్ విగ్రహం ప్రాజెక్టులను కొన్ని రోజుల వ్యవధిలోనే కేసీఆర్ ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈక్రమంలో ఫిబ్రవరి నెలాఖరులో కీలక నిర్ణయాలు వెలువడే పరిస్థితి కూడా వుంది. ‌

ఇదిలా వుంటే ఏపీలోని వైజాగ్ సిటీలో బీఆర్ఎస్ సభ నిర్వహణ నిర్ణయం దాదాపు జరిగిపోయిందని సమాచారం. ఉభయ గోదావరి జిల్లాలు మొదలుకొని సిక్కోలు జిల్లా దాకా జనసమీకరణ యత్నాల్లో తోట చంద్రశేఖర్ తదితరులు మునిగిపోయినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి నాలుగోవారం లేదా మార్చి తొలివారంలో వైజాగ్ వేదికగా భారత రాష్ట్ర సమితి సభ జరిగే అవకాశాలున్నాయని గులాబీ శ్రేణులు చెప్పుకుంటున్నాయి. ఏపీలో నిర్వహించే సభలోనే ఏపీ రాష్ట్ర బీఆర్ఎస్ కార్యవర్గాన్ని ప్రకటించే అవకాశాలున్నాయని చెప్పుకుంటున్నారు. ఏపీ తర్వాత కర్నాటకలోని రాయచూరులోగానీ, కలబురిగిలోగానీ కేసీఆర్ సభ జరిపే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఈలోగా న్యూఢిల్లీ వేదికగా మోదీ వ్యతిరేక నేతలతో ఓ భేటీ నిర్వహించాలని కూడా కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే అదానీ అంశంతో పార్లమెంటులో బీఆర్ఎస్ ఎంపీలు దూకుడు ప్రదర్శిస్తున్నట్లు సమాచారం. దాదాపు 18 పార్టీలు అదానీ వ్యవహారంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ నియమించి, విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ పార్టీలన్నీ కాంగ్రెస్ పార్టీ సారథ్యంలో పార్లమెంటు కార్యకలాపాలను అడ్డుకుంటున్నాయి. కాంగ్రెస్ పార్టీ సారథ్యంలోని 18 పార్టీల కూటమి (అదానీ వ్యవహారంపై ఉద్యమిస్తున్న పార్టీలు)లో బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు యాక్టివ్‌గా కనిపిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ సెక్రెటరీ జనరల్ కే.కేశవరావు పార్లమెంటు ఆవరణలో పలుమార్లు కాంగ్రెస్ నేతలతో భేటీ అవడం కనిపిస్తోంది. ఓవైపు బీజేపీని ఇబ్బంది పెడుతూనే బీఆర్ఎస్ పార్టీని విస్తరించాలని కేసీఆర్ వ్యూహరచన చేసినట్లు అవగతమవుతోంది.

అందాల తార శ్రియ కూతురిని చూశారా? ఎంత క్యూట్ గా ఉందో..
అందాల తార శ్రియ కూతురిని చూశారా? ఎంత క్యూట్ గా ఉందో..
ఆ స్టార్ హీరోతో రొమాన్స్ చేయబోతున్న బిగ్ బాస్ బ్యూటీ రతికా రోజ్
ఆ స్టార్ హీరోతో రొమాన్స్ చేయబోతున్న బిగ్ బాస్ బ్యూటీ రతికా రోజ్
మీ ఇంట్లో వేడిగా ఉంటోందా? ఫ్యాన్‌, కూలర్‌ లేకుండానే ఇల్లంతా కూల్‌
మీ ఇంట్లో వేడిగా ఉంటోందా? ఫ్యాన్‌, కూలర్‌ లేకుండానే ఇల్లంతా కూల్‌
అందాల ఆరబోతకు హద్దే లేదంటున్న దక్ష నాగర్కర్..
అందాల ఆరబోతకు హద్దే లేదంటున్న దక్ష నాగర్కర్..
పవన్‌ కల్యాణ్‌ ఆరోగ్యంపై జనసేన పార్టీ కీలక ప్రకటన
పవన్‌ కల్యాణ్‌ ఆరోగ్యంపై జనసేన పార్టీ కీలక ప్రకటన
ఇవి ఆకులే కదా అని తీసిపారేసేరు.. వీటి నీరు తాగితే అమృతమే..
ఇవి ఆకులే కదా అని తీసిపారేసేరు.. వీటి నీరు తాగితే అమృతమే..
వైఫై వేగంగా ఉండాలంటే ఈ  ప్రదేశాల్లో రౌటర్ అస్సలు ఉంచొద్దు
వైఫై వేగంగా ఉండాలంటే ఈ  ప్రదేశాల్లో రౌటర్ అస్సలు ఉంచొద్దు
హైదరాబాదీ బ్యాటర్ల పెను విధ్వంసం.. ఢిల్లీ ముందు భారీ టార్గెట్
హైదరాబాదీ బ్యాటర్ల పెను విధ్వంసం.. ఢిల్లీ ముందు భారీ టార్గెట్
హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే వారికి గుడ్‌న్యూస్..
హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే వారికి గుడ్‌న్యూస్..
దటీజ్ వంగా.! సందీప్ వంగా మీద నెగిటివ్ ప్రచారం చేస్తున్నదెవరు.?
దటీజ్ వంగా.! సందీప్ వంగా మీద నెగిటివ్ ప్రచారం చేస్తున్నదెవరు.?