CM KCR Visits Gadwal: జోగులాంబ గద్వాల టీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు పరామర్శించారు. ఆయనతోపాటు ఎమ్మెల్యే కుటుంబ సభ్యులను కూడా సీఎం కేసీఆర్ పరామర్శించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కృష్ణమోహన్ రెడ్డి తండ్రి వెంకట్రామిరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కృష్ణమోహన్ రెడ్డి కుటుంబ సభ్యులతో మాట్లాడి వారిని ఓదార్చారు. సీఎం కేసీఆర్ వెంట మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, పలువురు ఎమ్మెల్యేలు ఉన్నారు.
గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి తండ్రి వెంకట్రామిరెడ్డి ఇటీవల మృతిచెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వెంకట్రామిరెడ్డి తుదిశ్వాస విడిచారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కుటుంబాన్ని సీఎం కేసీఆర్ పరామర్శించారు.
Kcr
Also Read: