ఏం మనుషులురా మీరు.. రూ. 600 కోసం నిండి ప్రాణాన్ని తీశారు కదరా..!
హైదరాబాద్ మహానగరంలో వెలుగు చూసిన షాకింగ్ ఘటన ఇది. కేవలం రూ.600 కోసం ఓ వ్యక్తిపై హోటల్ సిబ్బంది దాడి చేసి చంపేశారు. ఈ సంఘటన నగరంలోని సరూర్‌నగర్‌లో చోటుచేసుకుంది. కర్మన్‌ఘాట్ ప్రాంతానికి చెందిన విశ్లావత్ శంకర్ (35) అనే వ్యక్తి అక్టోబర్ 22న తన స్నేహితులతో కలిసి కర్మన్‌ఘాట్‌లోని ఎన్-7 ఎలైట్ హోటల్‌లో చెక్‌ఇన్ అయ్యాడు.

హైదరాబాద్ మహానగరంలో వెలుగు చూసిన షాకింగ్ ఘటన ఇది. కేవలం రూ.600 కోసం ఓ వ్యక్తిపై హోటల్ సిబ్బంది దాడి చేసి చంపేశారు. ఈ సంఘటన నగరంలోని సరూర్‌నగర్‌లో చోటుచేసుకుంది. కర్మన్‌ఘాట్ ప్రాంతానికి చెందిన విశ్లావత్ శంకర్ (35) అనే వ్యక్తి అక్టోబర్ 22న తన స్నేహితులతో కలిసి కర్మన్‌ఘాట్‌లోని ఎన్-7 ఎలైట్ హోటల్‌లో చెక్‌ఇన్ అయ్యాడు. మరుసటి రోజు చెక్‌అవుట్ సమయంలో రూ.600 బ్యాలెన్స్ చెల్లింపుపై హోటల్ మేనేజ్‌మెంట్‌తో వాగ్వాదం జరిగింది. మాటామాటా పెరగడంతో హోటల్ సిబ్బంది కర్రలు, కుర్చీలతో శంకర్‌పై దాడి చేసినట్టు పోలీసులు తెలిపారు.
తీవ్ర గాయాలపాలైన శంకర్‌ను స్థానిక ఆసుపత్రికి తరలించారు. చికిత్స తీసుకుని ఇంటికి తిరిగొచ్చినా, అక్టోబర్ 27న సాయంత్రం ఆరోగ్యం క్షీణించడంతో మళ్లీ ఉస్మానియా జనరల్ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. శంకర్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు హోటల్ సిబ్బందిలోని నూర్, కమాలుద్దీన్, ఇస్లాం, రహీం అనే నలుగురిపై పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. స్థానికులు ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి చిన్న విషయాలకు నగరంలో ప్రాణం తీసే ఘటనలు పెరిగాయని.. పోలీసులు లా అండ్ ఆర్డర్‌ను అదుపులో ఉంచాలని కోరుతున్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
