శభాష్ పోలీస్.! సమయస్ఫూర్తితో నిండు ప్రాణాన్ని కాపాడాడు.. ప్రశంసలు అందుకున్నాడు..

Karimnagar police constable: ఉదయాన్నే లేచి డ్యూటీకి వెళ్లామా.! సాయంత్రానికి ఇంటికి వచ్చామా.! అన్నట్లు కాకుండా ఓ పోలీస్ సమయస్పూర్తిని...

  • Updated On - 8:58 am, Thu, 24 June 21
శభాష్ పోలీస్.! సమయస్ఫూర్తితో నిండు ప్రాణాన్ని కాపాడాడు.. ప్రశంసలు అందుకున్నాడు..
Traffic Police

ఉదయాన్నే లేచి డ్యూటీకి వెళ్లామా.! సాయంత్రానికి ఇంటికి వచ్చామా.! అన్నట్లు కాకుండా ఓ పోలీస్ సమయస్పూర్తిని ప్రదర్శించి అందరి ప్రశంసలు పొందుతున్నాడు. రోడ్డు ప్రమాదంలో గాయపడి అపస్మారక స్థితిలోకి వెళ్లిన యువకుడికి ఊపిరి పోశాడు ఓ పోలీస్ కానిస్టేబుల్. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

కరీంనగర్ హౌసింగ్ బోర్డు కాలనీ వద్ద ద్విచక్ర వాహనం ఢీకొట్టడంతో బొమ్మకల్‌కు చెందిన ఎండీ అబ్దుల్ ఖాన్‌కు గాయాలయ్యాయి. దీనితో అతడు అక్కడికక్కడే రోడ్డుపై పడిపోయి.. అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. ఇక అదే ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తున్న పోలీస్ కానిస్టేబుల్ ఎం.ఏ.ఖలీల్ సమయస్పూర్తితో వ్యవహరించాడు. అపస్మారక స్థితిలో ఉన్న ఆ యువకుడి ఛాతిపై సీపీఆర్(CPR) చేశాడు. అలా మూడు నిమిషాలు చేసిన తర్వాత అతడిలో చలనం వచ్చింది. వెంటనే 108లో అతడిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడు కోలుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే కానిస్టేబుల్ ఖలీల్ చూపించిన సమయస్పూర్తికి సీపీ కమలాసన్ రెడ్డితో పాటు పలువురు అభినందనలు తెలిపారు. అలాగే ఖలీల్ చేసిన పనికి సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘శభాష్ పోలీస్’ అంటూ కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు.

Also Read:

Viral Video: అందంతో చంపుతున్న సొట్టబుగ్గల సుందరి.. ఫిదా అవుతున్న నెటిజన్లు.. వైరల్ వీడియో.!

Viral Video: ఆఫ్రికన్ పైథాన్‌తో తల్లి చిరుత ఫైట్.. అది చేసిన పనికి నెటిజన్లు సలామ్.. వైరల్ వీడియో!

సెహ్వాగ్, డివిలియర్స్ స్టైల్‌లో.. 17 బంతుల్లో 76 పరుగులు.. బౌలర్లకు చుక్కలే చుక్కలు!