నలభై ఏళ్లుగా మంచానికే పరిమితమై నరకం చూస్తున్న వ్యక్తి.. ప్రభుత్వానికి శరీరం ఇస్తానంటూ మొర..!

| Edited By: Jyothi Gadda

Sep 22, 2024 | 6:45 PM

నీళ్ళు తాగిన‌, ఆహారం తీసుకున్న ఎవరో ఒకరూ సహాయం చెయాల్సిందే. ఇన్ని కష్టాలని‌ అనుభవిస్తూ శ్రీనివాస్ పోరాటం చేస్తున్నాడు. అయితే, శ్రీనివాస్ బాధ చూసిన ఓ‌ మహిళ నాలుగేళ్ల క్రితం తనను పెళ్ళి చేసుకుందని చెప్పాడు. అతని పాలన ప్రస్తుతం ఆ మహిళ చూసుకుంటుంది.  అనారోగ్యం తో బాధ పడుతున్న విషయం తెలిసి కూడ ఈ మహిళ పెళ్ళి చేసుకోవడం‌ అందరినీ ఆశ్వర్యానికి గురిచేసింది. 

నలభై ఏళ్లుగా మంచానికే పరిమితమై నరకం చూస్తున్న వ్యక్తి.. ప్రభుత్వానికి శరీరం ఇస్తానంటూ మొర..!
Muscle Atrophy
Follow us on

కరీంనగర్ జిల్లా కేంద్రం లోని హౌజింగ్ బోర్డు కాలనీకి చెందిన‌ కట్ల శ్రీనివాస్ పదిహేడు‌ ఏళ్ళ వరకు చాలా చురుకుగా ఉన్నాడు. అంతేకాకుండా మంచి అర్టిస్ట్. ఉన్నత చదువులు చదువు కోవాలనే లక్ష్యం తో ముందుకు‌ సాగుతున్నాడు…ఈ క్రమంలో ఓ రోజు తీవ్రమైన జ్వరం వచ్చింది. వివిధ అసుపత్రులలో ట్రీట్మెంట్ తీసుకున్నాడు..హైదరాబాదులో జరిపిన పరిక్షలలో కండరాల‌ క్షీణిత వ్యాధిగా గుర్తించారు. రోజురోజుకి వయస్సు పెరిగినా కొద్దీ శరీరంలో‌మార్పులు జరిగాయి. ఇరవై ఐదేళ్లు వచ్చేసరికి అతను మంచం మీద నుండి లేవలేని పరిస్థితి ఏర్పడింది.  ఈ వ్యాధికి ఇప్పటికి సరైన మందులు లేవంటున్నారు వైద్యులు. ఇలాంటి వ్యాధి ఐదు లక్షలలో‌ ఒకరికి అత్యంత అరుదుగా సోకుతుందని చెప్పారు. ఇప్పటి వరకు యోగా, ప్రాణాయామంతో శరీరాన్ని కాపాడుకుంటూ వస్తున్నానంటూ శ్రీనివాస్ వాపోతున్నాడు.

తనలాగ మరోకరు‌ బాధపడకూడదనే ఒక నిర్ణయానికి వచ్చానంటున్నాడు భాధితుడు. ఈ వ్యాధి నయం కావాడానికి తన‌ శరీరాన్ని పరిశోధనల కో సం వాడుకొవాలని‌ కోరుతున్నాడు. ఇలాంటి వ్యాధితో బాధపడుతున్న వారికి  మెరుగైన వైద్యం అందక చిన్న వయసులోనే మృతి చెందిన‌  వారి ఉదంతాలు కూడా ఉన్నాయి. శరీరం లో ఏ అవయవం కూడా పనిచెయ్యదు. నీళ్ళు తాగిన‌, ఆహారం తీసుకున్న ఎవరో ఒకరూ సహాయం చెయాల్సిందే. ఇన్ని కష్టాలని‌ అనుభవిస్తూ శ్రీనివాస్ పోరాటం చేస్తున్నాడు. అయితే, శ్రీనివాస్ బాధ చూసిన ఓ‌ మహిళ నాలుగేళ్ల క్రితం తనను పెళ్ళి చేసుకుందని చెప్పాడు. అతని పాలన ప్రస్తుతం ఆ మహిళ చూసుకుంటుంది.  అనారోగ్యం తో బాధ పడుతున్న విషయం తెలిసి కూడ ఈ మహిళ పెళ్ళి చేసుకోవడం‌ అందరినీ ఆశ్వర్యానికి గురిచేసింది.

మరోవైపు వైద్య రంగంలో ఆధునిక మార్పులు వస్తున్న ఇలాంటి వ్యాధులు ఎందుకు నయం కావడం లేదన్న చర్చ సాగుతుంది..ఈ క్రమంలోనే శ్రీనివాస్ ముందుకు వచ్చి తన‌ శరీరం పైన ప్రయోగాలు చేసుకోవచ్చని చెబుతున్నాడు. గతంలో చనిపోవాలని నిర్ణయించుకున్న,  ఇప్పుడు మాత్రం ఈ వ్యాధి సంగతి ఎంటో తెల్చుకోవడానికి సిద్దంగా ఉన్నట్లు ‌ధైర్యంగా చెబుతున్నాడు‌ శ్రీనివాస్..అంతేకాకుండా ఇలాంటి వ్యాధిగ్రస్తులకి భరోసా కల్పిస్తూ వారికి‌ కీలక సూచనలు చేస్తున్నాడు..

ఇవి కూడా చదవండి

ఈ వ్యాధి సోకిన తరువాత నలబైఏళ్ల వరకు బ్రతకటం అత్యంత అరుదు..ఈ విషయంలో తన‌ కుటుంబానికి ప్రభుత్వం భరోసా కల్పించాలని కోరుతున్నాడు.. తన‌ శరీరం ఏ మాత్రం ‌సహాకరించకున్న ధైర్యం తో ముందుకు‌ సాగుతున్నానని శ్రీనివాస్ ‌అంటున్నారు…చాల మంది ఈ వ్యాధి సోకితే మానసికంగా కోలుకోవడం లేదని‌ అంటున్నారు.. అందుకోసమే పరిశోధన ‌కోసం తన శరీరాన్ని‌ ఇవ్వడానికి‌ ముందుకు వచ్చినట్లుగా చెబుతున్నాడు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..