Telangana: తెలంగాణ వ్యాప్తంగా ఆ విషయంలో కరీంనగర్, ఖమ్మం జిల్లాలే టాప్.. అసలు మ్యాటర్ ఏంటంటే..!

Telangana: శిశువు.. అమ్మ కడుపులో నుంచి బయటకి రాక ముందే ముహూర్తాలు చూసేస్తున్నారు. దాని ఆధారంగానే సిజేరియన్లు జరుగుతున్నాయి.

Telangana: తెలంగాణ వ్యాప్తంగా ఆ విషయంలో కరీంనగర్, ఖమ్మం జిల్లాలే టాప్.. అసలు మ్యాటర్ ఏంటంటే..!
Operations
Follow us

|

Updated on: May 14, 2022 | 6:05 AM

Telangana: శిశువు.. అమ్మ కడుపులో నుంచి బయటకి రాక ముందే ముహూర్తాలు చూసేస్తున్నారు. దాని ఆధారంగానే సిజేరియన్లు జరుగుతున్నాయి. వీటిలో కరీంనగర్‌ జిల్లా తొలిస్థానంలో ఉండగా, ఖమ్మం రెండో స్థానంలో ఉంది. అయితే కరీంనగర్‌ జిల్లాలో అధికారులు ఇప్పటికే దీనిపై అలర్ట్‌ కాగా, ఇప్పుడు ఖమ్మం జిల్లా ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. ముహూర్తాల ద్వారా సిజేరియన్లు చేసే ప్రక్రియకు చెక్‌ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.

ముహూర్తాలు చూసుకుని సిజేరియన్లు చేసే జిల్లాల్లో కరీంనగర్‌ జిల్లాలో మొదట స్థానంలో ఉండగా, ఖమ్మం జిల్లా రెండో స్థానంలో ఉంది. దీంతో జిల్లాలోని ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. వైద్యాధికారులకు దీనిపై అవగాహన కల్పిస్తున్నారు. సాధ్యమైనంత త్వరగా ముహూర్తాల ఆధారంగా సిజేరియన్లు చేసే విధానానికి చరమగీతం పాడాలని సూచిస్తున్నారు. అంతేకాదు అసలు నార్మల్‌ డెలివరీలు పూర్తిగా తగ్గిపోయి, సిజేరియన్లు మాత్రమే కొనసాగుతుండటంపై కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సిజేరియన్లతో భవిష్యత్‌లో అనేక ఇబ్బందులు తలెత్తుతాయంటున్నారు.

సిజేరియన్లలో కరీంనగర్‌ జిల్లా తర్వాత ఖమ్మం రెండో స్థానంలో ఉండటంతో అధికారులు అలర్ట్‌ అయ్యారు. సిజేరియన్లను నివారించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఖమ్మం జిల్లా కలెక్టర్ గౌతమ్‌ ఓ అవగాహనా సదస్సు నిర్వహించారు. పురోహితులు, అర్చకులతో సమావేశం నిర్వహించారు. ———- స్పాట్‌ ———–

ఇవి కూడా చదవండి

సిజేరీయన్ ల వల్ల తల్లి ఆరోగ్యం దెబ్బతింటుందన్నారు కలెక్టర్. వీటిని అరికట్టాల్సిన బాధ్యత బ్రాహ్మణులపై వుందన్నారు. ముహూర్తాలు పెట్టడం వల్ల ఆపరేషన్లు జరుగుతున్నాయని, వాటిని అరికట్టాలని కోరారు.

అయితే ముందుగా ఆపరేషన్ కు సిద్ధం అయిన తరువాత మాత్రమే డాక్టర్ల సూచనతో కొంతమంది పురోహితులను మంచి గడియకోసం అడుగుతున్నారని తెలిపారు. అంతే కానీ పురోహితులు ఎప్పుడు ఆపరేషన్లను ప్రోత్సహించరని వివరణ ఇచ్చారు స్తంభాద్రి పురోహిత సంఘం కార్యదర్శి సరస్వతి భట్ల శ్రీధర్ శర్మ.

అలాగే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కూడా నార్మల్ డెలివరీ వారికి మాత్రమే సరియైన జాతకం చెప్పవచ్చు అన్నారు రాజేంద్ర ప్రసాద్. ప్రకృతి సిద్ధంగా సహజ ప్రసవాలు జరగాలని వారి హితం కోరే వారిలో బ్రాహ్మణులు ముందు వరసలో వుంటారన్నారు. అసలు ప్రసవానికి ముహూర్తాలు పెట్టడం అరుదు అని వచ్చిన కలెక్టర్‌ సదస్సుకు వచ్చిన పండితులు తెలిపారు.