కృష్ణమ్మ పరవళ్లు.. ప్రాజెక్టులకు జలకళ.. జూరాల జలాశయానికి పెరిగిన వరద

భారీ వర్షాలతో రాష్ట్రంలోని ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల జలాశయానికి పై నుంచి వరద కొనసాగుతోంది. జోగులాంబ గద్వాల జిల్లాలోని...

కృష్ణమ్మ పరవళ్లు..  ప్రాజెక్టులకు జలకళ.. జూరాల జలాశయానికి పెరిగిన వరద
Jurala Project

భారీ వర్షాలతో రాష్ట్రంలోని ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల జలాశయానికి పై నుంచి వరద కొనసాగుతోంది. జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు ఇన్‌ ఫ్లో పెరుగుతోంది. గురువారం జలాశయానికి 11,200 క్యూసెక్కుల నీరు వచ్చి చేరింది. ప్రాజెక్టు నుంచి మొత్తం 17,014 క్యూసెక్కుల నీటిని వదిలారు. అటు కర్ణాటకలోని ఆల్మట్టి ప్రాజెక్టుకు 58,587 క్యూసెక్కుల నీరు రాగా, మూడు గేట్ల ద్వారా 37,868 క్యూసెక్కుల నీటిని వదిలారు. నారాయణపూర్‌ ప్రాజెక్టుకు 37,196 క్యూసెక్కులు రాగా ఎనిమిది గేట్ల ద్వారా 36,639 క్యూసెక్కులను విడుదల చేశారు.

జూరాల పవర్‌హౌస్‌ నుంచి…

శ్రీశైలం ప్రాజెక్టుకు జూరాల పవర్‌హౌస్‌ నుంచి 13,872 క్యూసెక్కుల నీరు వస్తోంది. జలాశయం నుంచి 5,203 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 816.80 అడుగుల మేర నీరు ఉంది. నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు నీటి మట్టం 532.90 అడుగులకు చేరింది.

సాగర్‌ ప్రాజెక్టు నీటి మట్టం..

బుధవారం ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు 4,664 క్యూసెక్కుల నీటిని రివర్స్‌ పంపింగ్‌ చేయడంతో నీటిమట్టం స్వల్పంగా పెరిగింది. సాగర్‌ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు(312TMCలు) కాగా, ప్రస్తుతం 532.90 అడుగులు(173.8TMCలు)గా ఉంది. ప్రాజెక్టు నుంచి ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

డిండి ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో…

నల్లగొండ జిల్లాలోని డిండి ప్రాజెక్టు సామర్థ్యం 36 అడుగులు(2.4 TMCలు) కాగా గురువారానికి 31.1 అడుగులుగా ఉంది. మూసీ ప్రాజెక్టుకు 165 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. బుధవారం సాయంత్రానికి 635.50 అడుగులుగా ఉన్న ప్రాజెక్టు నీటిమట్టం గురువారం సాయంత్రానికి 636 అడుగులుగా నమోదైంది. సూర్యాపేట జిల్లాలోని పులిచింతల ప్రాజెక్టు సామర్థ్యం 175 అడుగులు కాగా, ప్రస్తుతం 150.49 అడుగుల మేర నీరు ఉంది. ఇన్‌ఫ్లో 1,960 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 600 క్యూసెక్కులుగా ఉంది.

Click on your DTH Provider to Add TV9 Telugu