తెలంగాణ JNTU-H పరీక్షల షెడ్యూల్ ఖరారు

తెలంగాణ పరీక్షల షెడ్యూల్ ఖరారైంది. బిటెక్, బిఫార్మ్, ఎంబీఏ ఫైనల్  రెండవ సెమిస్టర్ పరీక్షలు సెప్టెంబర్ 16 నుండి ప్రారంభం కానున్నాయిని వెల్లడించింది...

తెలంగాణ JNTU-H పరీక్షల షెడ్యూల్ ఖరారు
Sanjay Kasula

|

Sep 01, 2020 | 8:46 PM

తెలంగాణ పరీక్షల షెడ్యూల్ ఖరారైంది. బిటెక్, బిఫార్మ్, ఎంబీఏ ఫైనల్  రెండవ సెమిస్టర్ పరీక్షలు సెప్టెంబర్ 16 నుండి ప్రారంభం కానున్నాయిని వెల్లడించింది. లాక్ డౌన్ సడలింపుతో వాయిదా పడ్డ బీటెక్, బీఫార్మా, ఎంబీఏ పరీక్షల కోసం తేదీలను ఖరారు చేసింది. ఎప్పటిలాగా కాకుండా ఈసారి ప్రశ్నపత్రంలో మార్పులు, పరీక్ష సమయాన్ని కుదించారు. తాజా సమాచారం ప్రకారం జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం హైదరాబాద్‌ జెఎన్టియు, బీటెక్,బీఫార్మా, ఎంబీఏ చివరి సంవత్సరం రెండవ సెమిష్టర్ పరీక్షలు సెప్టెంబర్ 16 నుండి ప్రారంభం కానున్నాయి.

జెఎన్టియు -హెచ్ (JNTU-H)సెప్టెంబర్ 16 నుండి 25 తేదీలలో… బిబెక్ బిఫార్మ్4 సంవత్సరం సెకండ్ సెమిస్టర్ ఎంబీఏ రెండవ సంవత్సర సెకండ్ సెమిస్టర్.. కోసం రెగ్యులర్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూలు విడుదల చేసింది. బిటెక్ కోర్సులు, బిఫార్మ్, ఎంబీఏ రెండవ సంవత్సరం రెండవ సెమిస్టర్ పరీక్షలు ఉదయం 10.30 నుండి మధ్యాహ్నం 12.30 వరకు జరుగనున్నాయి.

బీటెక్ కోర్సులు-ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైనస్ ఇంజనీరింగ్, ఐటీలకు పరీక్షలు మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 4.30 వరకు నిర్వహించనున్నారు ముందే నిర్ణయించనున్నారు. పరీక్ష వ్యవధిని మూడు గంటల నుండి రెండు గంటలకు తగ్గించారు. పరీక్ష సమయ వ్యవధిలో తగ్గింపును భర్తీ చేయడానికి, జెఎన్టియు- హెచ్ (JNTU-H) ప్రశ్నపత్రం నమూనాను ఎనిమిది ప్రశ్నలను ఐదుగా మార్చి పరీక్షల్లో పార్ట్-ఎ ను తొలగించింది. పరీక్ష సమయంలో కోవిడ్-19 నిబంధనలకు అనుగుణంగా నిర్వహించనున్నారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu