
మొంథా తుఫాన్ ప్రభావంతో తెలంగాణలో రెండ్రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కల్వకుర్తి మండలం రఘుపతిపేట వద్ద ఉన్న దుందుభి నదికి వరద ఉధృతి పెరిగింది. దీంతో నది ఉప్పొంగి ప్రవహిస్తుంది. నది నీరు రోడ్డుపై నుంచి ప్రవహిస్తుండడంతో కల్వకుర్తి, నాగర్‌కర్నూల్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. లింగాల మండలం అవుసలికుంట- అంబటిపల్లి గ్రామాల మధ్య వాగు దాటేందుకు ప్రయత్నించి ఒక కారు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది. కారు ఉన్న వ్యక్తులు కాపాడలని కేకలు వేయడంతో గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.
సమాచారంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు జేసీబీ సహాయంలో వరద నీటిలో చిక్కుకుపోయిన వారిని రక్షించారు. అయితే ప్రమాద సమయంలో కారులో ఎంత మంది ఉన్నారనే సమాచారం మాత్రం తెలియదు. అయితే అక్కడే ఉన్న కొందరు స్థానికులు ఇందుకు సంబంధించిన దృశ్యాలను తమ ఫోన్‌లలో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడంతో ఈ దృశ్యాలు ప్రస్తుతం ట్రెండింగ్‌గా మారాయి.
ఈ వీడియో చూసిన అధికారులు నెటిజన్లు రొడ్డుపై నుంచి వరద నీరు అంత ఉధృతంగా ప్రవహిస్తున్న సమయంలో కారును ఎందుకు తీసుకెళ్లారని మండిపడుతున్నారు. వర్షాల నేపథ్యంలో ఇలా ఉధృతంగా ప్రవహించే వాగులు, వంకలు దాటే ప్రయత్నం ప్రజలు చేయొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.