CM KCR Public Meeting: కేంద్రానికి కేసీఆర్ స్ట్రాంగ్ కౌంటర్.. దేశం నుంచి తరిమేస్తామంటూ..

CM KCR Speech: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. కేంద్ర ప్రభుత్వంపై తన యుద్ధాన్ని కొనసాగిస్తున్నారు. జనగాం వేదికగా మరోసారి తన విశ్వరూపాన్ని ప్రదర్శించారు.

CM KCR Public Meeting: కేంద్రానికి కేసీఆర్ స్ట్రాంగ్ కౌంటర్.. దేశం నుంచి తరిమేస్తామంటూ..
Kcr Vs Modi
Follow us

|

Updated on: Feb 11, 2022 | 6:01 PM

CM KCR Speech: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. కేంద్ర ప్రభుత్వంపై తన యుద్ధాన్ని కొనసాగిస్తున్నారు. జనగాం వేదికగా మరోసారి తన విశ్వరూపాన్ని ప్రదర్శించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను ప్రజా వేదికగా తూర్పారబట్టారు. రేట్లు పెంచుతున్న విధానం, ప్రభుత్వ ఆస్తుల విక్రయం, విద్యుత్ అంశాలు సహా ఒక్కో అంశాన్ని ప్రస్తావిస్తూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బహిరంగ సభలో కేసీఆర్ ఏమన్నారో ఆయన మాటల్లోనే ఇప్పుడు చూద్దాం.. ‘‘కొట్లాడి తెలంగాణ సాధించుకున్నాం. ప్రస్తుతం తెలంగాణ రూపు రేఖలే మారిపోయాయి. నీటి బాధలు, కరెంట్ బాధలు పోయాయి. కేంద్ర ఏం ఇవ్వకున్నా ఉన్నవాటితో సరిపెట్టుకున్నాం. ఎనిమిదేళ్లలో కేంద్ర ప్రభుత్వంతో ఎప్పుడన్నా కొట్లాట పెట్టుకున్నామా? కానీ, ఇప్పుడు నరేంద్ర మోదీ పంచాయితీ మొదలైంది. కరెంట్ సంస్కరణల పేరుతో మోటార్లకు మీరు పెట్టాలంటున్నారు. నన్ను చంపినా పెట్టనని తెగేసి చెప్పిన.’’ అని అన్నారు.

కేంద్రానికి కేసీఆర్ స్ట్రాంగ్ కౌంటర్.. ‘‘దేశం నుంచి బీజేపీని తరిమేస్తాం. మాకు ఇచ్చేవాడిని తెచ్చుకుంటాం. దేశ రాజకీయాలను ప్రభావితం చేసే శక్తి వస్తే.. దేశం గురించి కొట్లాడేందుకు వెనుకాడం. ఇక్కడ బయలుదేరితే.. ఢిల్లీ కోట బద్దలు కొట్టేందుకు సిద్ధంగా ఉన్నాం. జాగ్రత్త నరేంద్ర మోదీ.. ఇది తెలంగాణ పులిబిడ్డ. మీ ఉడుత ఊపులకు భయపడేది లేదు. టీఆర్ఎస్ యుద్ధం చేసిన పార్టీ. పోరాటం చేసిన పార్టీ. దేశం కోసం కూడా పోరాటం చేస్తాం. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తాం.’’ అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

జనగాం ఘటనపై తీవ్రంగా స్పందించిన కేసీఆర్.. పార్లమెంట్‌లో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా జనగామలో టీఆర్ఎస్ నేతలు నిరసన కార్యక్రమాలు చేపట్టిన సందర్భంలో బీజేపీ-టీఆర్ఎస్ నేతల మధ్య జరిగిన వివాదంపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు. ‘‘జనగామ పట్టణంలో బీజేపీ కార్యకర్తలను టీఆర్ఎస్ కార్యకర్తలు కొట్టారు అని వార్త వచ్చింది. మేం మంచివాళ్లం. మిమ్మల్నీ ఏమీ అనం. కానీ మమ్మల్ని ముట్టుకుంటే నశం చేస్తాం తస్మాత్ జాగ్రత్త. మేం ఊదితే మీరు అడ్రస్ లేకుండా పోతారు.’’ అంటూ బీజేపీకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ముఖ్యమంత్రి కేసీఆర్.

Also read:

AP News: ఏపీలో రక్తం మోడిన రహదారులు.. పలు ప్రమాదాల్లో ఆరుగురు మృతి, 15 మందికి గాయాలు..

NTA SWAYAM July 2021: స్వయం జూలై 2021 అడ్మిట్ కార్డులు విడుదల.. 300 ఆన్‌లైన్‌ కోర్సుల్లో..

Ranga Ranga Vaibhavanga: అఫీషియల్ ప్రకటన వచ్చేసింది.. వైష్ణవ్ తేజ్ రంగ రంగ వైభవంగా రిలీజ్ అయ్యేది అప్పుడే..

మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..