Telangana: తెలంగాణ పంచాయితీ ఎన్నికల్లో చంద్రబాబు, జగన్.. అసలు మ్యాటర్ తెలిస్తే అవాక్కే
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి..జనరల్ ఎన్నికల రీతిలో నువ్వా నేనా అన్నట్లు పోటీ పడుతున్నారు..గెలుపు కోసం వ్యూహ ,ప్రతి వ్యూహాలతో పంచాయితీ పోరు రసవత్తరంగా మారింది.. భద్రాద్రి జిల్లా గుండ్లరేవు పంచాయితీ లో చంద్రబాబు, జగన్ పోటీ చేస్తున్నారు.

తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. జరుగుతున్నవి జనరల్ ఎన్నికలా అన్నట్టుగా అభ్యర్ధులు నువ్వా నేనా అన్నట్లు పోటీ పడుతున్నారు. గెలుపు కోసం వ్యూహ, ప్రతి వ్యూహాలతో పంచాయితీ పోరు రసవత్తరంగా మారింది. భద్రాద్రి జిల్లా గుండ్లరేవు పంచాయితీ లో చంద్రబాబు, జగన్ ఎన్నికల బరిలోకి దిగారు. ఇదేంటి అనుకుంటున్నారా..అవును వీరు ఇద్దరూ కాంగ్రెస్ నుంచే ఒకరి పై ఒకరు పోటీ చేస్తున్నారు..వెనక్కి తగ్గేది లేదంటూ విస్తృత ప్రచారం చేస్తున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం గుండ్లరేవు పంచాయితీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థులుగా చంద్రబాబు,జగన్ పోటీ చేస్తున్నారు..మీరు విన్నది నిజమే..కానీ, ఏపీ సిఎం చంద్రబాబు, మాజీ సీఎం జగన్ అనుకుంటున్నారా కాదు..ఇక్కడ పోటీ చేసే అభ్యర్ధుల పేర్లు భూక్యా చంద్రబాబు, బానోత్ జగన్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం గుండ్లరేవు గ్రామానికి చెందిన వీరిద్దరూ సర్పంచి స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. వారి పేర్లు భూక్యా చంద్రబాబు, బానోత్ జగన్నాథం అలియాస్ జగన్. ఇద్దరూ కాంగ్రెస్ లోని ఇరు వర్గీయుల మద్దతుతో బరిలో దిగారు. వీరి పేర్ల కారణంగా పోటీతోపాటు ప్రచారం ఆసక్తిగా మారింది. ఇద్దరూ పోటీలో నిలిచేందుకే ఆసక్తి చూపుతున్నారు. వీరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు నేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. భూక్యా చంద్రబాబు కు గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గా పని చేసే సమయంలో ఆయన మీద ఉన్న అభిమానంతో వాళ్ళ నాన్న చంద్రబాబు అని పేరు పెట్టారు.ఇపుడు ఇద్దరు అభ్యర్థులు వెనక్కి తగ్గేది లేదంటూ కాంగ్రెస్ తరపున ప్రత్యర్థులుగా తల పడుతున్నారు. మరి చివరి వరకు పోటీలో నిలిచేదెవరో.. గెలిచేదెవరో వేచి చూడాల్సిందే.
