Hyderabad: ఉప్పొంగిన దేశభక్తి.. హైదరాబాద్ లోని అపార్ట్ మెంట్లలో ఘనంగా స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకలు..

దేశానికి స్వాతంత్య్ర సిద్ధించి 75 వసంతాలు పూర్తై 76వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా స్వాంతంత్య్ర దినోత్సవ వజ్రోత్సవ వేడుకలు అంబరాన్నంటుతున్నాయి. నగరాల్లోని అపార్టమెంట్లు,

Hyderabad: ఉప్పొంగిన దేశభక్తి.. హైదరాబాద్ లోని అపార్ట్ మెంట్లలో ఘనంగా స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకలు..
Independence Day
Follow us

|

Updated on: Aug 15, 2022 | 12:04 PM

Hyderabad: దేశానికి స్వాతంత్య్ర సిద్ధించి 75 వసంతాలు పూర్తై 76వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా స్వాంతంత్య్ర దినోత్సవ వజ్రోత్సవ వేడుకలు అంబరాన్నంటుతున్నాయి. నగరాల్లోని అపార్టమెంట్లు, పెద్ద పెద్ద భవన సముదాయాల్లో ఉంటున్న వారు ఇండిపెండెన్స్ డే ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ లోని గేటెడ్ కమ్యూనిటీస్, బహుళ అంతస్తుల అపార్టమెంట్లలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వజ్రోత్సవ వేడుకలను జరుపుకున్నారు. పిల్లలు, పెద్దలు అంతా ఒక చోటకి చేరి జాతీయ జెండాను ఎగురవేసి, జనగనమణ ఆలపించారు. ఈసందర్భంగా పెద్దలు.. పిల్లలకు దేశ స్వాతంత్యదినోత్సవ ప్రత్యేకతను.. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల గురించి వివరించారు. పిల్లలకు మిఠాయిలు పంపిణీ చేశారు. మరోవైపు హర్ ఘర్ తిరంగలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై త్రివర్ణ పతకాన్ని రెపరెపలాడించారు.

పిల్లలు ఎంతో ఆసక్తిగా జాతీయ జెండాలు చేతపట్టి.. జైహింద్, భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేయడం అందరినీ ఆకట్టుకున్నాయి. తమలో దేశ భక్తిని చాటుతూ గేటెడ్ కమ్యూనిటీస్ లో ఉంటున్న వారు భారీ ప్రదర్శనలు నిర్వహించారు. గృహ సముదాయాలను త్రివర్ణ పతకా రంగులుతో కూడిన ప్లవర్స్, విద్యుదీపాలతో అలంకరించుకున్నారు. కొన్ని గేటెడ్ కమ్యూనిటీలలో సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటుచేసి, దేశ భక్తి గీతాలను ఆలపించారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కేంద్రప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఘనంగా ఆజాదీ కా అమృత్ హోత్సవ్ వేడుకలను నిర్వహిస్తుండటంతో పాటు.. స్వాతంత్య్ర దినోత్సవ వజ్రోత్సవ వేడుకలను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునివ్వడంతో ఈఏడాది ఎంతో ప్రత్యేకంగా ప్రజలంతా ఈవేడుకలను జరుపుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం చూడండి..