Telangana: 64 మంది విద్యార్థులున్నా స్కూల్ లేదు.. అద్దె గది కూడా దొరక్క చివరకు ఆలయంలోనే..

ఇక్కడి విద్యార్థులకు బాగా చదువుకోవాలనీ ఉంది.. చదువు చెప్పించాలని వారి తల్లిదండ్రులకూ ఉంది.. చదువు చెప్పేందుకు మంచి గురువులూ అందుబాటులో ఉన్నారు.. కానీ విద్యనభ్యసించడానికి...

Telangana: 64 మంది విద్యార్థులున్నా స్కూల్ లేదు.. అద్దె గది కూడా దొరక్క చివరకు ఆలయంలోనే..
School Students
Follow us

|

Updated on: Jun 24, 2022 | 12:59 PM

‘‘చదువని వాడజ్ఞుండగు

చదివిన సదసద్వివేక చతురత గలుగున్చ

దువగ వలయును జనులకు

ఇవి కూడా చదవండి

చదివించెదనార్యులొద్ద, చదువుము తండ్రీ!’’

ఆంధ్ర మహా భాగవతంలోని పాత్రల చేత పోతన చెప్పించిన గొప్ప పద్యాల్లో ఇది ఒకటి. హిరణ్య కశ్యపుడు తన కొడుకు ప్రహ్లాదుడిని గురువుల దగ్గరికి పంపిస్తూ ఇలా అంటాడు. “బాబూ! చదవనివాడికి విషయాలే తెలీదు. మరి చదివితే ఏమవుతుంది? మంచి-చెడుల మధ్య తేడా ఏంటో తెలుసుకోగలిగే శక్తి వస్తుంది. అందువల్ల అందరూ చదువుకోవాలి. నిన్ను నేను మంచి గురువుల దగ్గర ఉంచి చదివిస్తాను నాయనా, చక్కగా చదువుకో!” అని అంటాడు.

ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే.. ఇక్కడి విద్యార్థులకు బాగా చదువుకోవాలనీ ఉంది.. చదువు చెప్పించాలని వారి తల్లిదండ్రులకూ ఉంది.. చదువు చెప్పేందుకు మంచి గురువులూ అందుబాటులో ఉన్నారు.. కానీ విద్యనభ్యసించడానికి అవసరమైన వసతులే లేవు. ఇదే ఇప్పుడు నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలోని సాంవ్లీ గ్రామ పిల్లలకు ఇబ్బందిగా పరిణమించింది. అవును, నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలోని పాత సాంవ్లీ గ్రామంలో ప్రైమరీ స్కూల్‌కు పక్కా భవనం లేకపోవడంతో విద్యనభ్యసించే చిన్నారులు, విద్యను బోధించే ఉపాధ్యాయులూ ఇబ్బంది పడుతున్నారు. దాంతో దాదాపు 64 మంది పిల్లలకు స్థానిక శ్రీకృష్ణ ఆలయంలో తరగతులు నిర్వహిస్తున్నారు ఉపాధ్యాయులు.

వాస్తవానికి భైంసా గడ్డెన్న వాగు ప్రాజెక్టు నిర్మాణంలో సాంవ్లీ గ్రామం ముంపునకు గురైంది. దాంతో ఆ గ్రమ ప్రజలకు పునరావాసం ఏర్పాటు చేశారు. అయితే, అప్పట్లో స్కూల్ బిల్డింగ్ కోసం స్థలం కేటాయించడం మరిచారు. దీంతో గ్రామానికి చెందిన ప్రైమరీ స్కూల్ గతేడాది అద్దె భవనంలో కొనసాగించారు. అయితే, ఈసారి యజమాని రూమ్ ఖాళీ చేయాలని చెప్పడంతో స్కూల్‌ను గ్రామంలోని శ్రీకృష్ణ దేవాలయానికి షిఫ్ట్ చేశారు ఉపాధ్యాయులు. ఇక్కడ 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు 64 మంది విద్యార్థులను ఒకే చోట కూర్చోబెట్టి పాఠాలు చెబుతున్నామని టీచర్లు తెలిపారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి భవన నిర్మాణం చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..