Telangana: తెలంగాణపై ఫోకస్ పెంచిన బీజేపీ హైకమాండ్‌.. పదిరోజుల వ్యవధితో ప్రధాని మోదీ, అమిత్ షా పర్యటనలు..

తెలంగాణలో బీజేపీ అధికారమే లక్ష్యంగా కమలనాథులు కార్యాచరణకు పదును పెట్టారు. ఇప్పటికే ఉత్తర భారత దేశంలో పూర్తి పట్టు సాధించిన బీజేపీ.. ఇప్పుడు దక్షిణ భారతాన్ని తన గుప్పిట్లోకి తెచ్చుకోవాలనే దిశగా ముందుకు సాగుతోంది. ఆ నేపథ్యంలోనే తెలంగాణపై..

Telangana: తెలంగాణపై ఫోకస్ పెంచిన బీజేపీ హైకమాండ్‌.. పదిరోజుల వ్యవధితో ప్రధాని మోదీ, అమిత్ షా పర్యటనలు..
Pm Modi And Hm Shah To Visit Telangana In January
Follow us

|

Updated on: Jan 11, 2023 | 7:07 AM

తెలంగాణలో బీజేపీ అధికారమే లక్ష్యంగా కమలనాథులు కార్యాచరణకు పదును పెట్టారు. ఇప్పటికే ఉత్తర భారత దేశంలో పూర్తి పట్టు సాధించిన బీజేపీ.. ఇప్పుడు దక్షిణ భారతాన్ని తన గుప్పిట్లోకి తెచ్చుకోవాలనే దిశగా ముందుకు సాగుతోంది. ఆ నేపథ్యంలోనే తెలంగాణపై కమలం పార్టీ ప్రత్యేక దృష్టి సారించింది. ఈ కారణంగానే బీజేపీ అధిష్ఠానం తరచూ తెలంగాణకు వస్తూ.. ఒకవైపు పార్టీ నాయకులకు దిశా నిర్దేశం చేస్తూనే మరో వైపు ప్రజా శ్రేణుల్లో ఉత్సాహం నింపుతున్నారు. ఈ నేపథ్యంలోనే దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన 7 వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్నారు. ఆయన పర్యటన ముగిసిన కొద్ది రోజులకే కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా తెలంగాణకు విచ్చేయనున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే కీలక సమావేశం ఆర్ఎస్ఎస్ కూడా పార్టీని బలోపేతం చేసే పనులలో దూకుడుగా ఉంది.

ఈ నెల 19న రాష్ట్రానికి రానున్న ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణలో అనేక ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ ప్రాజెక్టుల విలువ సుమారు 7 వేల కోట్లకు పైగా ఉండనుందని అధికారుల మాట. ఇక మోదీ తన పర్యటనలో భాగంగానే వందే భారత్ ట్రైన్ ప్రారంభం, 699 కోట్ల రూపాయలతో సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్ ఆధునీకరణ పనులకు భూమిపూజ చేయనున్నారు. ఇంకా 1,410 కోట్ల వ్యయంతో సికింద్రాబాద్- మహబూబ్‌నగర్ మధ్య 85 కిలోమీటర్ల డబుల్ లైన్‌ జాతికి అంకితం చేయనున్నారు. ఐఐటీ హైదరాబాద్‌లో 2వేల,597 కోట్లతో చేపట్టిన నిర్మాణ పనులను ప్రారంభించనున్నారు.

 జనవరి నుంచే ప్రారంభించిన అమిత్ షా:

అయితే ప్రధాని పర్యటన ముగిసిన 10 రోజుల లోపే హోం మంత్రి రాష్ట్రానికి రానున్నారు. పార్టీ సంస్థాగత అంశాలే ప్రధాన అజెండాగా అమిత్ షా టూర్‌ ఉండబోతుందని పార్టీ వర్గాలు తెలిపాయి. అంతేకాక పార్టీ శ్రేణులను ఎన్నికలకు సమాయత్తం చేస్తూ దిశానిర్దేశం చేస్తారని, సంఘ్‌ నేతలతోనూ అమిత్ షా సమావేశమయ్యే అవకాశం ఉందని సమాచారం. గతేడాది(2022) ఐదుసార్లు తెలంగాణకు వచ్చిన అమిత్ షా, ఈ ఏడాది జనవరి నుంచే తన పర్యటనలను ప్రారంభించారు. పైగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో జాతీయ నేతలు తెలంగాణలో పదేపదే పర్యటిస్తుండటం.. వచ్చే ఎనిమిది నెలల్లో ఎప్పుడైనా ఎన్నికలు రావొచ్చు అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది.

ఇవి కూడా చదవండి

 కాగా, ఇప్పటికే టార్గెట్ 90 పేరుతో వచ్చే ఎన్నికల్లో 90 సీట్లను గెలవడమే లక్ష్యంగా బీజేపీ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది. ఎన్నికలు ముంచుకొస్తున్న నేపథ్యంలో మరింత స్పీడ్ పెంచింది కమలం పార్టీ. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 15 నుంచి అసెంబ్లీ స్థాయి సమావేశాలు, మార్చి 5 నుంచి జిల్లా స్థాయి సమావేశాలు నిర్వహిస్తామని ఎంపీ లక్ష్మణ్ ఇటీవలే ప్రకటించారు. ఏప్రిల్‌లో ప్రభుత్వంపై ఛార్జిషీట్ దాఖలు చేస్తామని, మిషన్ 90తో ప్రజల్లోకి వెళ్లాలని బీజేపీ నిర్ణయించుకుందని వివరించారు. కానీ.. అంతకు ముందు నుంచే సంస్థాగతంగా బలోపేతం అయ్యేందుకు బీజేపీ సైలెంట్‌గా కార్యచరణ అమలు చేస్తోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.