Telangana Rains: ఆ ఏడు జిల్లాలకు రెడ్ అలర్ట్.. మరో మూడు రోజుల పాటు ఇంతకు మించి వర్షాలు..

తెలంగాణలో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. 7 జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది.

Telangana Rains: ఆ ఏడు జిల్లాలకు రెడ్ అలర్ట్.. మరో మూడు రోజుల పాటు ఇంతకు మించి వర్షాలు..
Telangana Rains Cm Kcr
Follow us

|

Updated on: Jul 22, 2021 | 3:52 PM

వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. మరో మూడు రోజులు భారీ వర్షాలు పడతాయని  హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణలోని 7 జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. ఈ 12 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. అసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఇక సిరిసిల్ల, కరీంనగర్, ఖమ్మం, మహబూబాబాద్, సిద్ధిపేట, కామారెడ్డి, వరంగల్, హన్మకొండ, అదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షాలతోపాటు పలుచోట్ల ఉరుములు, మెరుపుల అలజడి ఉంటుందని హెచ్చరించింది.

గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వివరించింది. నది జలాల్లోకి మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించింది. తెలంగాణలోని ప్రాజెక్టులు నిండు కుండను తలపిస్తున్నాయి.

ఇదిలావుంటే.. రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. నది తీర ప్రాంతాల్లోని గ్రామాల్లోకి వరద నీరు వచ్చే అవకాశం ఉన్నందున అధికారులు హై అలర్ట్‌తో ఉండాలని ఆదేశించారు సీఎం కేసీఆర్‌. సహాయ చర్యలు చేపట్టేందుకు సహాయ బృందాలు రెడీ అండాలని సూచించారు.

SRSP ప్రాజెక్ట్‌ నిండుతోంది. ఎల్లంపల్లి, కడెం గేట్లు తెరిచారు. దీంతో గోదావరి పరివాహక ప్రాంత అధికారులు అలర్ట్‌గా ఉండాలని ఆదేశించారు. ఉత్తర తెలంగాణ జిల్లాల కలెక్టర్లు ఎప్పటికప్పుడు పరిస్థితిని పరిశీలించారు.

ఇవి కూడా చదవండి: KTR Birthday Gift: తెలంగాణలో దివ్యాంగులకు ఉచితంగా స్కూటీలు.. మంత్రి కేటీఆర్ ట్వీట్‌తో భారీ స్పందన

Breaking: ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్‌కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. ఆ రోజున కౌంటింగ్