TS Politics: ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్‌ను వీడే ప్రసక్తే లేదు…టీవీ9 తో భట్టి విక్రమార్క

హుజురాబాద్‌ ఉప ఎన్నిక పోలింగ్‌ సమీపిస్తున్న కొద్దీ టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీల మధ్య రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. ఇరు పార్టీ నేతల

TS Politics: ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్‌ను వీడే ప్రసక్తే లేదు...టీవీ9 తో భట్టి విక్రమార్క

హుజురాబాద్‌ ఉప ఎన్నిక పోలింగ్‌ సమీపిస్తున్న కొద్దీ టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీల మధ్య రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. ఇరు పార్టీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. బీజేపీతో కుమ్మక్కయ్యాయని పరస్పరం ఆరోపణలు, విమర్శలు చేసుకుంటున్నారు. బీజేపీ నేత ఈటల, తెలంగాణ కాంగ్రెస్‌ ప్రెసిడెంట్‌ రేవంత్ రెడ్డి గోల్కోండ రిసార్ట్‌లో రహస్యంగా కలిశారని మంత్రి కేటీఆర్‌ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. హుజురాబాద్‌ ఉప ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌ కుమ్మక్కయ్యాయని ఆయన పేర్కొ్న్నారు. ఈ నేపథ్యంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కూడా కాంగ్రెస్‌ను వీడుతున్నట్లు వార్తలొస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం ఓ కార్యక్రమంలో కేటీఆర్‌ ఆయనను పొగడడం ఈ అనుమానాలకు మరింత బలాన్నిస్తోంది. ఈ నేపథ్యంలో టీవీ9తో మాట్లాడిన భట్టి…తాను ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మారే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు.

కావాలనే అలా విష ప్రచారం చేస్తున్నారు.
‘నేను పార్టీ మారతానని వస్తోన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. కావాలనే కొందరు డబ్బులు వెదజల్లి మరీ ఇలా నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ఎట్టి పరిస్థితుల్లో నేను కాంగ్రెస్‌ను వదిలేసే ప్రసక్తే లేదు. నేను వాళ్లను, వీళ్లను కలిశానని కొందరు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. దమ్ముంటే నేను కలిసిన వాళ్లెవరో, అందుకు తగ్గ ఆధారాలను బయటపెట్టాలి’ అని భట్టి విక్రమార్క చెప్పుకొచ్చారు.

Also Read:

Huzurabad By Election: ఒక్క ఉపఎన్నిక.. 2 లక్షలకుపైగా ఓటర్లు.. 20 కంపెనీల కేంద్ర బలగాలు.. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి..

Huzurabad By Election: రేవంత్‌రెడ్డిని కలిసింది వాస్తవమే.. కానీ ఇప్పుడు కలవలేదు.. ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు..

Etela Rajender: సింగపూర్‌లో ఈటల ఎన్నికల ప్రచారం.. కళ్లలో మట్టికొట్టిది ముమ్మాటికీ ఆయనేనంటూ ఘాటు వ్యాఖ్యలు

Click on your DTH Provider to Add TV9 Telugu