Hyderabad: ఇంటిపై 100 మంది యువకుల ఎటాక్.. యువతి కిడ్నాప్.. రచ్చ.. రచ్చ

అచ్చం సినిమాలోలానే.. పదులు సంఖ్యలో యువకులు ఓ ఇంటిపై దాడి చేశారు. సామాను మొత్తం ధ్వంసం చేశారు. ఆ ఇంట్లోని యువతిని ఎత్తుకుని వెళ్లారు.

Hyderabad: ఇంటిపై 100 మంది యువకుల ఎటాక్.. యువతి కిడ్నాప్.. రచ్చ.. రచ్చ
Youg Women Kidnapped
Follow us

|

Updated on: Dec 09, 2022 | 5:36 PM

రంగారెడ్డి జిల్లా ఆదిభట్లలో యువతి కిడ్నాప్‌ ఎపిసోడ్‌ అగ్గిరాజేస్తోంది. యువతిని ఎత్తుకెళ్లిన నవీన్ రెడ్డి అనే యువకుడు.. ఆమె ఇంట్లో వీరంగం సృష్టించారు. సామగ్రిని ధ్వంసం చేసి కార్లను డ్యామేజ్ చేశారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తుండగానే.. బాధిత బంధువులు ఆగ్రహంతో రగిలిపోయారు. నవీన్ టీ స్టాల్‌ను తగలబెట్టారు. ఆ తర్వాత సాగర్‌ హైవే పై న్యాయం చేయాలంటూ బైఠాయించారు. అప్పటిదాకా ప్రశాంతంగా ఉన్న యువతి ఇల్లు.. నవీన్‌ రెడ్డి అండ్‌ కో ఎంట్రీతో రణరంగంగా మారింది. వందలమంది ఒక్కసారిగా ఇంటిపై పడ్డారు. ప్లాన్డ్‌గా వెంట తెచ్చుకున్న రాడ్లు, కర్రలతో కిటికీలను బ్రేక్ చేశారు. ఇంట్లో వస్తువుల్ని ధ్వంసం చేశారు. పార్క్ చేసిన కార్ల టైర్లలో గాలి తీసి.. డ్యామేజ్ చేశారు. దాడిని ప్రశ్నించిన వ్యక్తిపై మూకుమ్మడిగా దాడి చేశారు. దాడిలో కుటుంబసభ్యులకి గాయాలయ్యాయి.

కుటుంబసభ్యుల సాక్షిగా యువతిని ఎత్తుకెళ్లాడు నవీన్ రెడ్డి. ఎక్కడికి తీసుకెళ్లాడు? ఎందుకు తీసుకెళ్లాడన్నది ప్రస్తుతానికి మిస్టరీగా మారింది. కుటుంబసభ్యులు మాత్రం షటిల్ ఆడేందుకు వెళ్లిన తమ బిడ్డకు నవీన్ మాయమాటలు చెప్పేవాడని ఆరోపించారు. నవీన్ దాడితో ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది. దాడి ఘటన మరువకముందే యువతి కుటుంబసభ్యులు ఆగ్రహంతో రగిలిపోతూ నవీన్ టీస్టాల్‌ను తగలబెట్టారు. దీంతో ఏం జరుగుతుందో తెలియక స్థానికులు ఉలిక్కిపడ్డారు.

ఆ తర్వాత కుటుంబసభ్యులంతా కలిసి సాగర్ హై వే పై ధర్నాకు దిగారు. తమ బిడ్డ అచూకీ తెలపాలంటూ రోడ్డుపైనే బైఠాయించారు. రిటైర్డ్‌ ఆర్మీ కుటుంబానికి రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. యువతి బంధువుల ఆందోళనతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వైశాలి కిడ్నాప్ వ్యవహారంలో  కొత్తవిషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గత నాలుగేళ్లగా వీరిరువురు ప్రేమించుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. పెళ్ళికి  ఒప్పుకోకపోవడంతో సివిల్ కోర్ట్ ద్వారా వైశాలి పేరెంట్స్ కు నోటీసు పంపాడు నవీన్. వైశాలి తనతో సహజీవనం చేసిందని ఆ నోటీసులో పేర్కొన్నాడు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?