కరువు నేల రూపురేఖలను మార్చేసిన కాళేశ్వరం ప్రాజెక్ట్

చిరకాల స్వప్నం సాకారమవుతున్నది. ఎటు చూసినా రాళ్లురప్పలు, బీడువారిన భూములు.. వ్యవసాయం చేయాలంటే నింగేసి చూసే పరిస్థితి. వందలు, వేల లోతు త్రవ్విన చుక్కనీరు కనిపించని జాడ. అటువంటి పరిస్థితులు పోవాలంటూ.. సాగునీరు అందాలి. వర్షాధారంపై కాకుండా సముద్రంలోకి వృథాగా పోతున్న గోదావరి నది జలాలను ఒడిసిపట్టి పంటపొలాలకు అందించాలి. బీడు భూములు కావవి.. సాగు భూములుగా తీర్చిద్దాలన్న సంకల్పంతో దేశంలోనే అతి పెద్ద ఎత్తపోతల పథకం కాళేశ్వరం ప్రాజెక్ట్ ను చేపట్టింది తెలంగాణ ప్రభుత్వం. ఇన్నాళ్లూ […]

కరువు నేల రూపురేఖలను మార్చేసిన కాళేశ్వరం ప్రాజెక్ట్
Follow us

|

Updated on: May 27, 2020 | 3:39 PM

చిరకాల స్వప్నం సాకారమవుతున్నది. ఎటు చూసినా రాళ్లురప్పలు, బీడువారిన భూములు.. వ్యవసాయం చేయాలంటే నింగేసి చూసే పరిస్థితి. వందలు, వేల లోతు త్రవ్విన చుక్కనీరు కనిపించని జాడ. అటువంటి పరిస్థితులు పోవాలంటూ.. సాగునీరు అందాలి. వర్షాధారంపై కాకుండా సముద్రంలోకి వృథాగా పోతున్న గోదావరి నది జలాలను ఒడిసిపట్టి పంటపొలాలకు అందించాలి. బీడు భూములు కావవి.. సాగు భూములుగా తీర్చిద్దాలన్న సంకల్పంతో దేశంలోనే అతి పెద్ద ఎత్తపోతల పథకం కాళేశ్వరం ప్రాజెక్ట్ ను చేపట్టింది తెలంగాణ ప్రభుత్వం. ఇన్నాళ్లూ దిగువకు పరుగులు పెడుతున్న గోదారమ్మను బీడు భూము ల్లోకి తరలించే భగీరథయత్నానికి శ్రీకారం చుట్టారు ముఖ్యమంత్రి కేసీఆర్. కరువును సమూలంగా పారదోలి వ్యవసాయాన్ని పండుగ చేయాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్‌ ప్రారంభించిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రజల జీవన గమనాన్నే పూర్తిగా మార్చనుంది. కాళేశ్వరం ప్రాజెక్టు ఎత్తిపోతల ద్వారా ప్రతి జలాశయానికి నీటిని నింపనున్నారు. దీంతో తెలంగాణలోని ప్రతి పల్లె వ్యవసాయ సిరులతో ఆకు పచ్చని మాగాణీ నేలలుగా మారనున్నాయి. పచ్చని బైళ్లతో సస్యశ్యామలమైన తెలంగాణ పాడి పంటలతో రైతుల కళ్లల్లో ఆనందం చూడాలనే సీఎం కేసీఆర్ ఆశయం. తన మానస పుత్రికగా చెప్పుకునే కాళేశ్వరం ప్రాజెక్టును అనుక్షణం పర్యవేక్షిస్తూ.. అకుంటిత దీక్షతో పూర్తి చేశారు సీఎం కేసీఆర్. మే 29న కొండ పోచమ్మ సాగర్ జలాశయానికి నీరు పంపింగ్ చేయడం ద్వారా బృహత్తర ఘట్టం పూర్తవుతుంది

1. లక్ష్మీబరాజ్‌ మేడిగడ్డ వద్ద నిర్మించిన లక్ష్మీ బరాజ్‌లో గోదావరిని ఒడిసిడతారు. గోదారమ్మ తన గమనాన్ని మార్చుకుని తెలంగాణ బీడు భూముల వైపు ప్రస్థానాన్ని మొదలు పెట్టేది ఇక్కడే. బరాజ్‌ నిల్వ సామర్థ్యం 16.17 టీఎంసీ లు. బరాజ్‌ ఫోర్‌షోర్‌లోని కన్నెపల్లి వద్ద నిర్మించిన లక్ష్మీ పంపుహౌజ్‌ నుంచి ఎత్తిపోత మొదలవుతుంది.

2. సరస్వతి లక్ష్మీ పంపుహౌజ్‌ నుంచి జలాలు 119 మీటర్లలో ఉన్న సరస్వతి బరాజ్‌లోకి వస్తాయి. ఫోర్‌షోర్‌లో నిర్మించిన సరస్వతి పంపు హౌజ్‌ నుంచి రెండో దశ లో జలాల్ని ఎత్తిపోస్తారు.

3. పార్వతి పంపుహౌజ్‌ సరస్వతి పంపుహౌజ్‌ నుంచి జలా లు 130 ఎఫ్‌ఆర్‌ఎల్‌లోని పార్వతి బజార్‌లోకి వస్తాయి. పార్వతి పంపు హౌజ్‌ నుంచి మూడోదశలో నీటిని ఎత్తిపోస్తారు.

4. నంది బరాజ్‌ పార్వతి పంపుహౌజ్‌ నుంచి ఎత్తిపోసిన జలాలు 148 మీటర్ల ఎఫ్‌ఆర్‌ఎల్‌లో ఉన్న ఎల్లంపల్లి జలాశయంలోకి వస్తాయి. అక్కడి నుంచి గ్రావిటీపై 9.534 కిలోమీటర్ల జంట సొరంగాల ద్వారా వచ్చే నీటిని నంది పంపుహౌజ్‌ లోని మోటర్ల ద్వారా ఎత్తిపోస్తారు.

5. గాయత్రీ పంపుహౌజ్‌ నంది పంపుహౌజ్‌ ద్వారా ఎత్తిపోసిన జలాలు 11.24 కిలోమీటర్ల జంట సొరంగాల ద్వారా గాయత్రీ పంపుహౌజ్‌కు చేరుకుంటా యి. అక్కడ ఆసియాలో అతిపెద్ద 139 మెగావాట్ల సామర్థ్యం ఉన్న ఏడు మోటర్లు ద్వారా రోజుకు రెండు టీఎంసీలు ఎత్తి… ఎస్సారెస్పీ వరద కాల్వ 99 కిలోమీటర్‌ వద్ద పోస్తారు.

6. శ్రీరాజరాజేశ్వర జలాశయం ఎస్సారెస్పీ వరద కాల్వ నుంచి జలాలు 318 ఎఫ్‌ ఆర్‌ఎల్‌లో ఉన్న శ్రీరాజరాజేశ్వర జలాశయంలోకి వస్తాయి. ఇక్కడి నుంచి గ్రావిటీపై వచ్చే నీటిని చంద్లాపూర్‌ పంపుహౌజ్‌ ద్వారా ఎత్తిపోస్తారు.

7. తిప్పాపూర్‌ ఎస్సారార్‌నుంచి జలాలు 397 ఎఫ్‌ఆర్‌ఎల్‌లో ఉన్న అన్నపూర్ణలోకి వస్తాయి. 8.590 కిలోమీటర్ల సొరంగం ద్వారా తిప్పాపూర్‌ పంపుహౌజ్‌కు చేరుకుంటాయి. అక్కడి నుంచి రంగనాయక్‌ సాగర్‌లోకి ఎత్తిపోస్తారు.

8. తుక్కాపూర్‌ రంగనాయకసాగర్‌ నుంచి 4.20 కిలోమీటర్ల కాల్వ, 16.180 కిలోమీటర్ల సొరంగం ద్వారా జలాలు తుక్కాపూర్‌ పంపుహౌజ్‌కు చేరుకుంటాయి. ఇక్కడ 43 మెగావాట్ల సామర్థ్యం ఎనిమిది మోటార్లతో రోజుకు 0.8 టీఎంసీల నీటిని ఎత్తిపోస్తారు.

9. అక్కారం పంప్‌హౌజ్‌ తుక్కాపూర్‌ పంప్‌హౌజ్‌ నుంచి ఎత్తిపోసిన జలాలు అక్కారం పంప్‌హౌజ్‌కు చేరుకుంటాయి. ఇక్కడ 27 మెగావాట్ల సామర్థ్యం ఆరు మోటార్లతో రోజుకు 7500 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తారు.

10. మర్కూక్‌ పంప్‌హౌజ్‌ తుక్కాపూర్‌ పంపుహౌజ్‌ నుంచి ఎత్తిపోసిన జలాలు మర్కూక్‌ పంపుహౌజ్‌కు చేరుకుంటాయి. ఇక్కడ 34 మెగావాట్ల సామర్థ్యంతో ఉన్న ఆరు మోటార్ల ద్వారా 7500 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తారు. ఇలా ఎత్తిపోసిన గోదావరిజలాలు 618 ఎఫ్‌ఆర్‌ఎల్‌లో ఉన్న కొండ పోచమ్మసాగర్‌లోకి ప్రవేశిస్తాయి. ఈ జలాశయం నిల్వ సామర్థ్యం 15 టీఎంసీలు.

11.రంగనాయక్‌సాగర్‌ తిప్పాపూర్‌ పంపుహౌజ్‌ నుంచి ఎత్తిపోసిన జలాలు 490 ఎఫ్‌ఆర్‌ఎల్‌లో ఉన్న రంగనాయకసాగర్‌ జలాశయంలోకి వస్తాయి.ఈ జలాశయ నిల్వ సామర్థ్యం మూడు టీఎంసీలు. తెలంగాణలోని ప్రతి పల్లెను గోదావరి జలాలతో సస్యశ్యామలం చేయడమే ప్రధాన లక్ష్యం. గ్రామాల్లోని ప్రతి చెరువును కుంటను కాలువల ద్వారా నీటిని నింపుతారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ప్రతి చెరువుకు జియో ట్యాగింగ్‌ చేశారు. జలాశయాల నుంచి నేరుగా చెరువులను నింపేందుకు ఇరిగేషన్‌ అధికారులు చెరువులకు జియోట్యాగింగ్‌ చేశారు. మిషన్‌ కాకతీయ మొబైల్‌ యాప్‌లో చెరువుల ఫొటోలు, తూములు, ఫీడర్‌ చానళ్లను పొందుపర్చడంతో ప్రతి చెరువుకు ఒక కోడ్‌ నమోదు అవుతుంది. ఈ విధంగా కరువు నేల సైత కాసులసిరిని కురుపించనుంది. తెలంగాణ పల్లె.. కోటి మాగాణి సీమగా మారనుంది.

రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
అయ్య బాబోయ్.. వీడెవడండి బాబు.. థియేటర్‌లో ల్యాప్‌టాప్‌తో వర్క్
అయ్య బాబోయ్.. వీడెవడండి బాబు.. థియేటర్‌లో ల్యాప్‌టాప్‌తో వర్క్
లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్