నిండు గర్భిణి… బస్ లోనే.. !!

హైదరాబాద్ మలక్ పేట లోని నల్గొండ చౌరస్తాలో 108 అంబులెన్స్ లో ఓ మహిళ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన రవి భార్య గౌరి(22) బడంగ్ పేట లో నివాసము ఉంటుంది. పురిటి నొప్పులు రావటంతో ఓలా క్యాబ్ లో బయలుదేరిన ఆమెను సంతోష్ నగర్ చౌరస్తాలో 108 అంబులెన్స్ సిబ్బంది శ్రీశైలం, పైలెట్ సారథి లు పికప్ చేసుకొని పేట్ల బురుజు ఆసుపత్రికి తీసుకెళ్తుండగా నల్గొండ చౌరస్తాలో మగ బిడ్డను […]

  • Tv9 Telugu
  • Publish Date - 11:39 pm, Thu, 3 October 19
నిండు గర్భిణి... బస్ లోనే.. !!

హైదరాబాద్ మలక్ పేట లోని నల్గొండ చౌరస్తాలో 108 అంబులెన్స్ లో ఓ మహిళ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన రవి భార్య గౌరి(22) బడంగ్ పేట లో నివాసము ఉంటుంది. పురిటి నొప్పులు రావటంతో ఓలా క్యాబ్ లో బయలుదేరిన ఆమెను సంతోష్ నగర్ చౌరస్తాలో 108 అంబులెన్స్ సిబ్బంది శ్రీశైలం, పైలెట్ సారథి లు పికప్ చేసుకొని పేట్ల బురుజు ఆసుపత్రికి తీసుకెళ్తుండగా నల్గొండ చౌరస్తాలో మగ బిడ్డను ప్రసవించింది. అంబులెన్స్ సిబ్బంది తల్లీ, బిడ్డను కోఠీ ప్రసూతి ఆసుపత్రిలో చేర్పించారు. ఇద్దరూ క్షేమంగానే ఉన్నట్లు అంబులెన్స్ సిబ్బంది తెలిపారు.