BJP Vijaya Sankalpa Sabha: కేటీఆర్‌ను ఎలా సీఎం చేయాలనేదే ఆయన ఆలోచన.. సీఎం కేసీఆర్‌పై కేంద్ర మంత్రి అమిత్‌ షా సెటైర్లు..

Amit Shah: ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా అధికారంలోకి వచ్చి తీరతామన్నారు. కేటీఆర్‌ను ఎలా సీఎం చేయాలనేదే సీఎం కేసీఆర్ ఆలోచిస్తున్నారని ఎద్దేవ చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో మేం మద్దతిచ్చాం.. గతంలో..

BJP Vijaya Sankalpa Sabha: కేటీఆర్‌ను ఎలా సీఎం చేయాలనేదే ఆయన ఆలోచన.. సీఎం కేసీఆర్‌పై కేంద్ర మంత్రి అమిత్‌ షా సెటైర్లు..
Amit Shah
Sanjay Kasula

|

Jul 03, 2022 | 6:41 PM

వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ విజయం సాధిస్తుందని కేంద్ర మంత్రి అమిత్‌ షా ధీమా వ్యక్తం చేశారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా అధికారంలోకి వచ్చి తీరతామన్నారు. పరేడ్‌ గ్రౌండ్స్‌లో నిర్వహిస్తున్న విజయ సంకల్ప సభలో ఆయన మాట్లాడారు. నీళ్లు, నిధులు, నియామకాలతో తెలంగాణ రాష్ట్ర ఏర్పడిందన్నారు. తెలంగాణ ప్రజలకు నీళ్లు, నిధులు, నియామకాలు అందాయా? అని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ అవినీతి పాలనను అంతమొందిస్తామన్నారు. కేసీఆర్‌కు ఉన్న చింత ఒక్కటేనని, కేటీఆర్‌ను సీఎం చేయడమేనన్నారు. తెలంగాణ పోరాటానికి మొదటి నుంచి బీజేపీ మద్దుతుందన్నారు. రాష్ట్ర విభజనను కాంగ్రెస్ అసంపూర్తిగా చేసిందని మండిపడ్డారు. కేటీఆర్‌ను ఎలా సీఎం చేయాలనేదే సీఎం కేసీఆర్ ఆలోచిస్తున్నారని ఎద్దేవ చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో మేం మద్దతిచ్చాం.. గతంలో మేం 3 రాష్ట్రాలు ఏర్పాటు చేసినప్పుడు సమస్యలు రాలేదన్నారు.

టీఆర్ఎస్ కారు స్టీరింగ్‌ అసదుద్దీన్‌ ఒవైసీ చేతుల్లో ఉందన్నారు. ఎనిమిదేళ్లలో ఒక్కసారైనా సచివాలయానికి వెళ్లారా అని సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించారు. పటేల్ లేకుంటే హైదరాబాద్ రాష్ట్రం భారత్‌లో భాగం అయ్యేది కాదని గుర్తు చేశారు. దేశం పురోగమిస్తుంటే.. తెలంగాణ తిరోగమనంలో ఉందన్నారు. హైదరాబాద్‌ విమోచన దినాన్ని కేసీఆర్ వ్యతిరేకించారని విమర్శించారు కేంద్ర మంత్రి అమిత్‌షా.

 

తెలంగాణ వార్తల కోసం..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu