Hyderabad: హైదరాబాదీలకు గుడ్‌ న్యూస్‌.. పూర్తి స్థాయిలో రోడ్డెక్కనున్న సిటీ బస్సులు.. విద్యార్థుల కోసం ప్రత్యేకంగా..

Hyderabad: ఏమంటూ కరోనా మహమ్మారి వెలుగులోకి వచ్చిందో.. అప్పటి నుంచి అన్ని రకాల కార్యకలాపాలు స్థంభించాయి. వ్యాపారాల నుంచి..

Hyderabad: హైదరాబాదీలకు గుడ్‌ న్యూస్‌.. పూర్తి స్థాయిలో రోడ్డెక్కనున్న సిటీ బస్సులు.. విద్యార్థుల కోసం ప్రత్యేకంగా..
Hyderabad City Buses
Follow us

| Edited By: Phani CH

Updated on: Oct 26, 2021 | 6:54 AM

Hyderabad: ఏమంటూ కరోనా మహమ్మారి వెలుగులోకి వచ్చిందో.. అప్పటి నుంచి అన్ని రకాల కార్యకలాపాలు స్థంభించాయి. వ్యాపారాల నుంచి విద్యా సంస్థలు, కార్యాలయాల వరకు అన్ని రకాల పనులు పూర్తిగా ఆగిపోయాయి. దీంతో ఈ ప్రభావం ఆర్టీసీపై కూడా పడింది. ముఖ్యంగా హైదరాబాద్‌ నగరంలో సిటీ బస్సులను పరిమితం చేశారు. విద్యా సంస్థలు మూతపడడం, ఆన్‌లైన్‌ తరగతులకే పరిమితం కావడంతో బస్సుల సంఖ్యను పూర్తిగా తగ్గించారు. ఇక సిటీ బస్సులను ఎక్కువగా ఉపయోగించుకునే వారిలో ఇంజనీరింగ్ విద్యార్థులే ఎక్కువగా ఉంటారు. నగర శివారుల్లో ఉండే కాలేజీలకు పెద్ద ఎత్తున సిటీ బస్సులు రాకపోకలు సాగిస్తుంటాయి. కరోనా కారణంగా విద్యా సంస్థలు మూతపడడంతో ఈ సర్వీసులు అన్ని ఆగిపోయాయి.

అయితే తాజాగా కరోనా తగ్గుముఖం పట్టడం, ఇంజినీరింగ్, వృత్తివిద్యా కళాశాలలు తిరిగి తెరుచుకోవడంతో విద్యార్థుల రద్దీని దృష్టిలో ఉంచుకొని పలు మార్గాల్లో అదనపు ట్రిప్పులను పెంచినట్లు హైదరాబాద్‌ రీజినల్‌ మేనేజర్‌ వెంకన్న తెలిపారు. ముఖ్యంగా ఇబ్రహీంపట్నం, ఘట్కేసర్, కీసర, చేవెళ్ల, మొయినాబాద్, గండిమైసమ్మ తదితర రూట్లలో విద్యార్థుల రద్దీకి అనుగుణంగా బస్సులను పెంచనున్నారు. ఇందులో భాగంగానే నగరంలోని అన్ని వైపుల బస్సు సర్వీసులను పెంచనున్నట్లు వెంకన్న తెలిపారు.

కీసర, గండిమైసమ్మ, బాచుపల్లి, కుత్బుల్లాపూర్, మేడ్చల్‌ తదితర ప్రాంతాల్లోని విద్యాసంస్థలకు రాకపోకలు సాగించేందుకు వీలుగా ట్రిప్పులను పెంచేందుకు అధికారులు కసరత్తు మొదలు పెట్టారు. అలాగే ఇబ్రహీంపట్నం, ఘట్కేసర్, చుట్టుపక్కల ప్రాంతాల్లోని కళాశాలలకు రాకపోకలు సాగించే విద్యార్థుల కోసం ఉప్పల్, నాగోల్, ఎల్‌బీనగర్‌ తదితర ప్రాంతాల నుంచి అదనపు బస్సులను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టినట్లు ఆర్‌ఎం వెంకన్న చెప్పారు.

Also Read: Makeup Tips: అదరాలు అందంగా కనిపించాలంటే.. లిప్‌స్టిక్‌ ఎలా వేసుకోవడంలో కొన్ని చిట్కాలు తెలుసుకోండి..

Ind Vs Pak: మహ్మద్ షమీ నీకు మద్దతు.. సోషల్ మీడియాలో నెటిజన్ల కామెంట్లపై  ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఫైర్..

Andhra Pradesh: భర్త క్షణికావేశం.. ఎంతటి దారుణానికి రెచ్చగొట్టిందో చూడండి..!