Hyderabad: ఆర్టీసీ డ్రైవర్లకు సజ్జనార్‌ వార్నింగ్‌.. ఇకపై బస్సును రోడ్డు మధ్యలో ఆపితే చర్యలు తప్పవు.

Hyderabad: సాధారణంగా బస్సులు వాటికోసం ప్రత్యేకంగా కేటాయించిన బస్టాపుల్లో ఆగాల్సి ఉంటుంది. అయితే కొంతమంది డ్రైవర్లు మాత్రం బద్దకంతోనో, త్వరగా గమ్యాన్ని చేరుకోవాలనే ఉద్దేశంతోనే బస్టాప్‌లోకి రాకుండా..

Hyderabad: ఆర్టీసీ డ్రైవర్లకు సజ్జనార్‌ వార్నింగ్‌.. ఇకపై బస్సును రోడ్డు మధ్యలో ఆపితే చర్యలు తప్పవు.
Follow us

|

Updated on: Sep 28, 2021 | 7:27 AM

Hyderabad: సాధారణంగా బస్సులు వాటికోసం ప్రత్యేకంగా కేటాయించిన బస్టాపుల్లో ఆగాల్సి ఉంటుంది. అయితే కొంతమంది డ్రైవర్లు మాత్రం బద్దకంతోనో, త్వరగా గమ్యాన్ని చేరుకోవాలనే ఉద్దేశంతోనే బస్టాప్‌లోకి రాకుండా రోడ్డు మధ్యలోనే ఆపేస్తుంటారు. అయితే ఏ వాహనమైనా రోడ్డుపై ఆగాల్సి వస్తే ఎడమవైపు తీసుకొని ఆపాల్సి ఉంటుంది. కొన్ని కొందరు డ్రైవర్లు దీనికి భిన్నంగా వ్యవహరిస్తుంటారు. ముఖ్యంగా హైదరాబాద్‌ సిటీ బస్సుల్లో ప్రయాణించే వారు ఇలాంటి సమస్యను చాలాసార్లు ఎదుర్కొనే ఉంటారు. అయితే ఇకపై డ్రైవర్లు ఇలా నిర్లక్ష్యంతో వ్యవహరిస్తే కుదరని చెబుతున్నారు తెలంగాణ ఆర్టీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వి.సి సజ్జనార్‌.

ఈ విషయమై తాజాగా సోమవారం ఆయన ఉత్తర్వులు జారీ చేశారు. ప్రయాణికులను ఎక్కించుకునేందుకు కానీ దించేందుకు కానీ రోడ్డు మధ్యలో బస్సులు ఆపటం ట్రాఫిక్‌ నిబంధనలకు విరుద్ధం అని, ఎవరైనా ఈ నిబంధనలను అతిక్రమిస్తే.. ట్రాఫిక్‌ పోలీసులు విధించే జరిమానాను డ్రైవర్ల నుంచి వసూలు చేయటమే కాకుండా, క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకోవాల్సి వస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇంకా ఉత్తర్వుల్లో ఏముందంటే.. బస్సులను ఉన్నపలంగా రోడ్డు మధ్యలో ఆపడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని సోషల్‌ మీడియా వేదికగా ఫిర్యాదులు వస్తున్నాయని, దీనివల్ల ఆర్టీసీ ప్రతిష్ఠ దెబ్బతింటుందని తెలిపారు. సంస్థకున్న పరపతిని పెంచుకోవాలని, అలాగే ఉన్న పరపతిని కాపాడుకోవాలని పేర్కొన్నారు.

రోడ్డు మధ్య బస్సులను ఆపటం నేరమన్న విషయాన్ని డ్రైవర్లకు తెలిసేలా.. డిపోల నుంచి రహదారులపైకి వచ్చే ముందు డీజిల్‌ బంకుల వద్ద బోర్డులు ఏర్పాటుచేయాలని తెలిపారు. అలాగే డ్యూటీ ఛార్టులు ఇచ్చే ముందు డ్రైవర్లకు సూపర్‌వైజర్లు ఈ విషయాన్ని వివరించాలని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠినంగా వ్యవహరించే విషయాన్ని వివరించాలి.. అని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Also Read: Pawan – YCP : పవన్‌ కళ్యాణ్‌పై మంత్రి పేర్ని నాని ఫైర్.. ట్విట్టర్ వేదికగా సంచలన కామెంట్స్..

Horoscope Today: ఏ రాశివారు స్త్రీ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.. ఈరోజు రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

Zojila Tunnel: నేడు జోజిలా టన్నెల్‌ను సందర్శించనున్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ.. మేఘా ప్రతినిధులతో భేటీ..

మీన రాశిలో వక్ర గ్రహాల కలయిక.. ఆ రాశుల వారికి విచిత్ర యోగాలు!
మీన రాశిలో వక్ర గ్రహాల కలయిక.. ఆ రాశుల వారికి విచిత్ర యోగాలు!
బ్యాంకులకు ఆర్బీఐ షాక్.. ఖాతా నుంచి రూ.15 వేలు మాత్రమే విత్‌డ్రా
బ్యాంకులకు ఆర్బీఐ షాక్.. ఖాతా నుంచి రూ.15 వేలు మాత్రమే విత్‌డ్రా
బ్రదర్స్‌ ఎవరు? బద్దశత్రువులెవరు..? గరం గరంగా తెలంగాణ రాజకీయం
బ్రదర్స్‌ ఎవరు? బద్దశత్రువులెవరు..? గరం గరంగా తెలంగాణ రాజకీయం
శ్రీరామనవమి సందర్భంగా కోట్లాది భక్తులకు నిరాశే!
శ్రీరామనవమి సందర్భంగా కోట్లాది భక్తులకు నిరాశే!
వేసవిలో పని చేసి అలసిపోతున్నారా.. తినే ఆహారంలో వీటిని చేర్చుకోండి
వేసవిలో పని చేసి అలసిపోతున్నారా.. తినే ఆహారంలో వీటిని చేర్చుకోండి
ఇక డూ ఆర్ డై.. ఆర్సీబీ సెకండ్ హాఫ్ మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదిగో..
ఇక డూ ఆర్ డై.. ఆర్సీబీ సెకండ్ హాఫ్ మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదిగో..
అధినేత సమక్షంలోనే ఎడమొఖం పెడముఖంగా నేతలు
అధినేత సమక్షంలోనే ఎడమొఖం పెడముఖంగా నేతలు
అరెస్టుల పర్వం ముగిసిపోలేదు.. ఢిల్లీ మద్యం కేసులో మరో అరెస్ట్..
అరెస్టుల పర్వం ముగిసిపోలేదు.. ఢిల్లీ మద్యం కేసులో మరో అరెస్ట్..
యూపీఎస్సీ సివిల్స్‌లో సత్తాచాటిన తెలుగమ్మాయి..
యూపీఎస్సీ సివిల్స్‌లో సత్తాచాటిన తెలుగమ్మాయి..
పట్టు పరికిణిలో అందాల ముద్దుగుమ్మ.. ఈ వయ్యారిని చూసి మతిపోయేనే..
పట్టు పరికిణిలో అందాల ముద్దుగుమ్మ.. ఈ వయ్యారిని చూసి మతిపోయేనే..