వారితో ఉంటేనే దేశ భక్తులు.. లేకపోతే దేశద్రోహులు..! కేటీఆర్ ఫైర్

కొందరు తమతో ఉంటే దేశ భక్తులు లేకపోతే దేశద్రోహులు అనేలా వ్యవహరిస్తున్నారని బీజేపీ వ్యవహారశైలిపై పరోక్ష విమర్శలు గుప్పించారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. గాంధీని చంపిన వారిని దేశభక్తులుగా అభివర్ణించిన సాథ్వీ ప్రఙ్ఞాసింగ్‌‌ కామెంట్లను సమర్థిస్తూ.. తనపై ట్విట్టర్‌లో కామెంట్లు రావడం చాలా బాధ కలిగించిందని ఆయన అన్నారు. జాతిపితను గౌరవించుకోలేని జాతి మనదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో మతం, జాతీయవాదం పెనవేసుకున్నాయని.. మతోన్మాదం పెరిగితే భవిష్యత్ తరాలకు ముప్పుతప్పదని కేటీఆర్ ఆందోళన వ్యక్తం […]

వారితో ఉంటేనే దేశ భక్తులు.. లేకపోతే దేశద్రోహులు..! కేటీఆర్ ఫైర్
Follow us

| Edited By:

Updated on: Aug 10, 2019 | 4:40 PM

కొందరు తమతో ఉంటే దేశ భక్తులు లేకపోతే దేశద్రోహులు అనేలా వ్యవహరిస్తున్నారని బీజేపీ వ్యవహారశైలిపై పరోక్ష విమర్శలు గుప్పించారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. గాంధీని చంపిన వారిని దేశభక్తులుగా అభివర్ణించిన సాథ్వీ ప్రఙ్ఞాసింగ్‌‌ కామెంట్లను సమర్థిస్తూ.. తనపై ట్విట్టర్‌లో కామెంట్లు రావడం చాలా బాధ కలిగించిందని ఆయన అన్నారు. జాతిపితను గౌరవించుకోలేని జాతి మనదంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

దేశంలో మతం, జాతీయవాదం పెనవేసుకున్నాయని.. మతోన్మాదం పెరిగితే భవిష్యత్ తరాలకు ముప్పుతప్పదని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయని.. వీటిని విభేదించే పరిస్థితి లేకపోతే ప్రజాస్వామ్యానికి అర్థం లేదని పేర్కొన్నారు. మతం అన్నది పూర్తిగా వ్యక్తిగతమని.. దాన్ని వేరే అంశాలతో ముడిపెట్టడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ వికాస సమితి మహాసభల ప్రారంభోత్సవంలో కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు.