Telangana: అవన్నీ పుకార్లే నమ్మొద్దు.. రైతుబంధుపై క్లారిటీ ఇచ్చిన మంత్రి నిరంజన్ రెడ్డి

బీజేపీ(BJP) ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రైతు బంధును దేశవ్యాప్తంగా అమలు చేయాలని తెలంగాణ మంత్రి నిరంజన్ రెడ్డి(Minister Niranjan Reddy) సవాల్ విసిరారు. రైతు బంధు పథకంపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఎక్కువ భూమి....

Telangana: అవన్నీ పుకార్లే నమ్మొద్దు.. రైతుబంధుపై క్లారిటీ ఇచ్చిన మంత్రి నిరంజన్ రెడ్డి
Rythubandhu Scheme
Follow us

|

Updated on: Jun 29, 2022 | 3:04 PM

రైతు బంధు పథకంపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి (Minister Niranjan Reddy)  మండిపడ్డారు. ఎక్కువ భూమి ఉన్నవారికే రైతు బంధు వస్తుంది అనేది అవాస్తవమని వెల్లడించారు. ఈ పుకార్లను నమ్మొద్దని సూచించారు. ఎనిమిది విడతల్లో రూ.85 వేల కోట్లను రైతులకు అందించామని చెప్పారు.  బీజేపీ(BJP) ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రైతు బంధును దేశవ్యాప్తంగా అమలు చేయాలని సవాల్ విసిరారు. మినిస్టర్స్ క్వార్టర్స్ లో మంత్రి నిరంజన్ రెడ్డి సమావేశం నిర్వహించారు. కేంద్రం పాలిస్తున్న రాష్ట్రాల్లో ఎక్కడైనా ఈ పథకాలు అమలు అవుతున్నాయా? అని ప్రశ్నించారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానని చెప్పిన ప్రధాని మోదీ(PM Modi) ఆ హామీని నిలబెట్టుకున్నారా అని నిలదీశారు. రైతుల ఉద్యమంతో వ్యవసాయ చట్టాలని వెనక్కి తీసుకున్నారన్న మంత్రి.. ఫసల్ బీమా యోజన మంచి పథకం అయితే మోదీ సొంత రాష్ట్రంలో ఎందుకు అమలు చేయడం లేదన్నారు.

మోటర్లకు మీటర్లు పెట్టాలని ప్రధాని ప్రయత్నిస్తున్నారు. స్వయంగా బీజేపీ పాలించే రాష్ట్రంలోని రైతులే దీన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్నారు. కేంద్రం నుంచి నిధులు రావటం లేదని మేము పదే పదే చెప్తున్నాం. కానీ కేంద్రం నుంచి వచ్చిన నేతలు మాత్రం ఇస్తున్నామనే చెబుతున్నారు. డిజిటల్ చెల్లింపులు, ఇతర చెల్లింపులు జీఎస్టీ ద్వారా నేరుగా కేంద్రానికి పోతున్నాయి. అందులో రాష్ట్ర వాటానూ కేంద్రం ఇవ్వటం లేదు. పెన్షన్స్ లో కూడా సగం కేంద్రం ఇస్తోంది అని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇలా మాట్లాడటానికి బీజేపీ నేతలకు అసహ్యంగా అనిపించడం లేదా.

  – నిరంజన్ రెడ్డి, తెలంగాణ మంత్రి

ఇవి కూడా చదవండి

మెజారిటీ ఉన్న రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వాలను కూల్చి బీజేపీ గద్దెనెక్కుతోందని మంత్రి నిరంజన్ రెడ్డి విమర్శించారు. చిత్తశుద్ధి ఉంటే రైతు బంధును దేశ వ్యాప్తంగా అమలు చేయాలని సవాల్ చేశారు. 24 గంటలు ఉచిత విద్యుత్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.