బస్‌ ఛార్జీల చెల్లింపుల్లో తెలంగాణ ప్రభుత్వం వినూత్న ఆలోచన..!

లాక్‌డౌన్ సడలింపుల్లో భాగంగా ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా బస్సులను నడుపుతోంది తెలంగాణ ప్రభుత్వం. అయితే కరోనా నేపథ్యంలో టికెట్ ఛార్జీల విషయంలో టీఎస్‌ఆర్టీసీ వినూత్న ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.

బస్‌ ఛార్జీల చెల్లింపుల్లో తెలంగాణ ప్రభుత్వం వినూత్న ఆలోచన..!
Follow us

| Edited By:

Updated on: Jun 06, 2020 | 2:29 PM

లాక్‌డౌన్ సడలింపుల్లో భాగంగా ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా బస్సులను నడుపుతోంది తెలంగాణ ప్రభుత్వం. అయితే కరోనా నేపథ్యంలో టికెట్ ఛార్జీల విషయంలో టీఎస్‌ఆర్టీసీ వినూత్న ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. గూగుల్ పే, ఫోన్‌ పే, పేటీఎం ద్వారా ప్రయాణికులు టికెట్ ఛార్జీలను చెల్లించేలా ఏర్పాట్లు చేయాలన్న భావనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. క్యూఆర్ కోడ్ ఆధారంగా డబ్బులు చెల్లించే విధానాన్ని అందుబాటులోకి తీసుకు రావాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. మొదటి దశలో భాగంగా ఈ విధానాన్ని దూర ప్రాంతాలకు రాకపోకలు సాగించే సర్వీసుల్లో ప్రయోగాత్మకంగా అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే కర్ణాటకలో ఈ విధానం ఇప్పటికే అమలవుతోంది.

ఇదిలా ఉంటే అంతరాష్ట్ర బస్సు సర్వీసులపై తెలంగాణకు ఏపీ సీఎస్ నీలం సాహ్ని లేఖ రాశారు. తెలంగాణకు బస్సులు నడిపేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, మీరు కూడా ఏపీకి బస్సులు నడపాలని ఆ లేఖలో ఆమె పేర్కొన్నారు. దీనిపై  తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ మాట్లాడుతూ.. అంతరాష్ట్ర, సిటీ బస్సులు నడిపేందుకు ఇంకా సమయం పట్టే అవకాశం ఉందని స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

Read This Story Also: హాట్ ర‌ష్మీకి స్వీట్ గిప్ట్..అమ్మ‌డు షాక్…