సీఎం కేసీఆర్ ఇంట విషాదం!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంట విషాదం చోటుచేసుకుంది. కేసీఆర్ సోదరి విమలాదేవి భర్త రాజేశ్వర రావు (84) శనివారం మరణించారు. ఈ వార్త తెలుసుకున్న కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, కుటుంబసభ్యులు.. రాజేశ్వరరావు పార్థివ దేహానికి నివాళులర్పించి, కుటుంబసభ్యులను ఓదార్చారు. స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, ఎల్లారెడ్డి సురేందర్‌లు కూడా రాజేశ్వర రావు కుటుంబసభ్యులను పరామర్శించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా మర్రిమడ్లకి చెందిన పర్వతనేని రాజేశ్వరరావు.. హైదరాబాద్‌లోని అల్వాల్ మంగాపురం కాలనీలో నివాసం ఉంటున్నారు. శనివారం […]

  • Tv9 Telugu
  • Publish Date - 7:06 am, Sun, 9 February 20
సీఎం కేసీఆర్ ఇంట విషాదం!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంట విషాదం చోటుచేసుకుంది. కేసీఆర్ సోదరి విమలాదేవి భర్త రాజేశ్వర రావు (84) శనివారం మరణించారు. ఈ వార్త తెలుసుకున్న కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, కుటుంబసభ్యులు.. రాజేశ్వరరావు పార్థివ దేహానికి నివాళులర్పించి, కుటుంబసభ్యులను ఓదార్చారు. స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, ఎల్లారెడ్డి సురేందర్‌లు కూడా రాజేశ్వర రావు కుటుంబసభ్యులను పరామర్శించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా మర్రిమడ్లకి చెందిన పర్వతనేని రాజేశ్వరరావు.. హైదరాబాద్‌లోని అల్వాల్ మంగాపురం కాలనీలో నివాసం ఉంటున్నారు. శనివారం అనారోగ్యం కారణంగా ఆయన తుదిశ్వాస విడిచారు. కేసీఆర్ సోదరి విమలాదేవి గత ఏడాదిలో కన్నుమూశారు. శనివారం సాయంత్రమే తిరుమలగిరి స్వర్గదామ స్మశానవాటికలో రాజేశ్వర రావు అంత్యక్రియలు ముగిశాయి. అంత్యక్రియలు పూర్తయ్యేవరకూ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావులు అక్కడే ఉన్నారు.