Telangana Cabinet Meeting: లాక్‌డౌన్ ఎత్తివేత.? మరి థియేటర్ల మాటేంటి.! నేడే నిర్ణయం..

Telangana Lockdown: తెలంగాణలో ‌లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తేస్తారా.? లేదా నైట్ కర్ఫ్యూ మాత్రమే విధిస్తారా.? అనే దానిపై శనివారం(ఇవాళ) స్పష్టత రానుంది....

Telangana Cabinet Meeting: లాక్‌డౌన్ ఎత్తివేత.? మరి థియేటర్ల మాటేంటి.! నేడే నిర్ణయం..
Kcr
Follow us

|

Updated on: Jun 19, 2021 | 9:59 AM

తెలంగాణలో ‌లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తేస్తారా.? లేదా నైట్ కర్ఫ్యూ మాత్రమే విధిస్తారా.? అనే దానిపై శనివారం(ఇవాళ) స్పష్టత రానుంది. ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర కేబినేట్ అత్యవసర భేటి కానుంది. ఈ సమావేశంలో రాష్ట్రంలో లాక్‌డౌన్ ఎత్తేయాలా.? నైట్ కర్ఫ్యూ విధించాలా.? అనే అంశంతో పాటు వర్షపాతం, వానాకాలం సాగు, వ్యవసాయం సంబంధిత సీజనల్ అంశాలు, గోదావరిలో నీటిని లిఫ్టు చేసే అంశం, హైడల్ పవర్ ఉత్పత్తి, నూతన విద్యా సంవత్సరం ప్రారంభంపై మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకోనుంది.

ప్రస్తుతం రాష్ట్రంలో ఉదయం 6 గంటల నుంచి సాయత్రం 5 గంటల(ప్రజలు ఇళ్లకు చేరుకునేందుకు మరో గంట) వరకు సడలింపులతో కూడిన లాక్‌డౌన్ అమలులో ఉంది. రాష్ట్రంలో కరోనా కేసులు గణనీయంగా తగ్గుముఖం పట్టిన నేపధ్యంలో ఈ నెల 20వ తేదీ నుంచి లాక్‌డౌన్ ఎత్తివేసి.. నైట్ కర్ఫ్యూను విధించే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. రాత్రి 9 గంటల(ప్రజలు ఇళ్లకు చేరుకోవడానికి మరో గంట) నుంచి ఉదయం 6 వరకు కర్ఫ్యూను కఠినంగా అమలు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.

అయితే జనసాంద్రత ఎక్కువగా ఉండే థియేటర్లు, షూటింగ్‌లకు, పార్కులు, జిమ్‌లకు అనుమతి ఇస్తారా.? మరికొంతకాలం మూసి ఉంచుతారా.? అనేది కేబినేట్ సమావేశంలో తేలనుంది. అటు ఈ నెల 21వ తేదీ నుంచి విద్యాసంస్థలను ప్రారంభించాలన్న ప్రతిపాదన ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై మంత్రివర్గం భేటిలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కాగా, అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులను మాత్రం ఇప్పట్లో అనుమతించే అవకాశాల్లేవని సమాచారం.

Also Read:

కలలో దెయ్యాలు కనిపిస్తున్నాయా? అయితే మీరు డేంజర్ జోన్‌లో ఉన్నట్లే! ఎందుకంటే?

పైథాన్‌ను మింగేసిన నాగుపాము.. గగుర్పాటుకు గురి చేసే వీడియో.!

బుట్టబొమ్మ ఈజ్ బ్యాక్.. సమంత ప్లేస్‌ను కొట్టేసిందిగా..!
బుట్టబొమ్మ ఈజ్ బ్యాక్.. సమంత ప్లేస్‌ను కొట్టేసిందిగా..!
బంగ్లా నౌకలో సముద్రపు దొంగల బీభత్సం.! నిఘా పెట్టిన భారత యుద్ధ నౌక
బంగ్లా నౌకలో సముద్రపు దొంగల బీభత్సం.! నిఘా పెట్టిన భారత యుద్ధ నౌక
అతనితో ప్రేమలోపడిన రజినీకాంత్ కూతురు.. షాక్ అవుతున్న నెటిజన్స్
అతనితో ప్రేమలోపడిన రజినీకాంత్ కూతురు.. షాక్ అవుతున్న నెటిజన్స్
4 నెలల మనవడికి రూ.240 కోట్ల బహుమతి ఇచ్చిన తాత
4 నెలల మనవడికి రూ.240 కోట్ల బహుమతి ఇచ్చిన తాత
గడ్చిరోలిలో భారీ ఎన్‌కౌంటర్.. నలుగురు కీలక నక్సల్స్ హతం!
గడ్చిరోలిలో భారీ ఎన్‌కౌంటర్.. నలుగురు కీలక నక్సల్స్ హతం!
సమ్మర్ కోసం ఏసీలు కొంటున్నారా.? అయితే ఈ టిప్స్ మీ కోసమే.!
సమ్మర్ కోసం ఏసీలు కొంటున్నారా.? అయితే ఈ టిప్స్ మీ కోసమే.!
అలా చేస్తానని అస్సులు ఊహించలేదు.. ఇప్పుడు గర్వపడుతున్నా..
అలా చేస్తానని అస్సులు ఊహించలేదు.. ఇప్పుడు గర్వపడుతున్నా..
ఆర్సీబీ విజయంపై సిద్ధార్థ్ కాంట్రవర్సీ ట్వీట్.. నెటిజన్ల ఆగ్రహం
ఆర్సీబీ విజయంపై సిద్ధార్థ్ కాంట్రవర్సీ ట్వీట్.. నెటిజన్ల ఆగ్రహం
బస్సుల్లేక అవస్థలు.. తికమకలో మరో కేంద్రానికి వెళ్లిన విద్యార్థిని
బస్సుల్లేక అవస్థలు.. తికమకలో మరో కేంద్రానికి వెళ్లిన విద్యార్థిని
త్వరలోనే వైసీపీ మేనిఫెస్టో రిలీజ్.. జగన్‌ చెప్పాడంటే చేస్తాడంతే
త్వరలోనే వైసీపీ మేనిఫెస్టో రిలీజ్.. జగన్‌ చెప్పాడంటే చేస్తాడంతే