హైదరాబాద్‌లో పెరుగుతోన్న స్వైన్‌ ఫ్లూ.. మహిళ మృతి

ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాధితో ప్రజలు బెంబేలెత్తుతోంటే.. ఇందుకు విరుద్ధంగా హైదరాబాద్‌లో స్వైన్‌ ఫ్లూ కేసులు నమోదవుతున్నాయి. ఇటీవల కరీంనగర్‌కి చెందిన షెహనాజ్ అనే గర్భిణి గాంధీ చికిత్స పొందుతూ స్వైన్‌ ఫ్లూతో..

హైదరాబాద్‌లో పెరుగుతోన్న స్వైన్‌ ఫ్లూ.. మహిళ మృతి
Follow us

| Edited By:

Updated on: Feb 26, 2020 | 1:56 PM

ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాధితో ప్రజలు బెంబేలెత్తుతోంటే.. ఇందుకు విరుద్ధంగా హైదరాబాద్‌లో స్వైన్‌ ఫ్లూ కేసులు నమోదవుతున్నాయి. ఇటీవల కరీంనగర్‌కి చెందిన షెహనాజ్ అనే గర్భిణి గాంధీ చికిత్స పొందుతూ స్వైన్‌ ఫ్లూతో మృతి చెందింది. వరంగల్ నుంచి వచ్చేప్పుడే డెంగ్యూ, స్వైన్‌ ఫ్లూతో గాంధీలో చేరింది మహిళకి వైద్యులు సిజేరియన్ చేసి డెలీవరీ చేశారు. అయితే పాప పరిస్థితి బాగానే ఉన్నా..షెహనాజ్.. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతున్న సమయంలోనే గుండెపోటుతో మంగళవారం మరణించింది. అయితే వైద్యులు సరిగా వైద్యం చేయలేదని బంధువులు ఆరోపిస్తున్నారు. ఏదేమైనా ఇప్పుడు ఈ వార్తతో జనాలు భయాందోళన చెందుతున్నారు.

తాజాగా.. సుప్రీం కోర్టులోని ఆరుగురు జడ్జీలు, పలువురు లాయర్లకు హెచ్1ఎన్1 వైరస్‌తో బాధపడుతున్నారని జస్టిస్ డివై చంద్రచూడ్‌ వెల్లడించారు. దీంతో.. సుప్రీంకోర్టులో పని చేసే మిగతా వారికి స్వైన్ ఫ్లూ రాకుండా నివారణ చర్యలు తీసుకోవాలని అందుకు అవసరమైన ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఇప్పుడు మరికొన్ని కేసులు గాంధీలో నమోదయినట్లు సమాచారం.