బ్రేకింగ్ : శివరాంపల్లిలో భారీ పేలుడు.. ఒకరు మృతి

బ్రేకింగ్ : శివరాంపల్లిలో భారీ పేలుడు.. ఒకరు మృతి

హైదరాబాద్ నగరంలో భారీ పేలుడు సంభవించింది. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శివరాంపల్లి పీవీ ఎక్స్‌ప్రెస్ 280వ పిల్లర్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఫుట్ పాత్ వద్ద ఉన్న ఓ అనుమానాస్పద డబ్బాను తెరిచేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించాడు. అయితే ఆ డబ్బా తెరిచే క్రమంలో భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి ఓ వ్యక్తి మృతి చెందగా.. మరోకరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. శంషాబాద్ డీసీపీ ప్రకాష్ […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Sep 08, 2019 | 12:33 PM

హైదరాబాద్ నగరంలో భారీ పేలుడు సంభవించింది. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శివరాంపల్లి పీవీ ఎక్స్‌ప్రెస్ 280వ పిల్లర్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఫుట్ పాత్ వద్ద ఉన్న ఓ అనుమానాస్పద డబ్బాను తెరిచేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించాడు. అయితే ఆ డబ్బా తెరిచే క్రమంలో భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి ఓ వ్యక్తి మృతి చెందగా.. మరోకరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. శంషాబాద్ డీసీపీ ప్రకాష్ రెడ్డి పేలుడు జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మృతిచెందాడు. మరో వ్యక్తికి చికిత్స అందిస్తున్నారు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పేలిన బాక్సు రసాయనాలతో ఉన్నదానిగా భావిస్తున్నారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu