Railway News: టిక్కెట్ లేకుండా రైళ్లలో ప్రయాణం.. ప్రయాణికుల నుంచి ఎంత ఫైన్ వసూలు చేశారో తెలిస్తే షాకే..

SCR Review Meeting : గత ఆర్థిక సంవత్సరానికి (2021-22) సంబంధించి దక్షిణ మధ్య రైల్వే జోన్‌లో టికెట్‌ తనిఖీల ద్వారా రూ.111.52 కోట్ల ఆదాయం వచ్చిందని దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్‌ చీఫ్‌ కమర్షియల్‌ మేనేజర్‌ (పీసీసీఎమ్‌) జి.జాన్‌ ప్రసాద్‌ తెలిపారు.

Railway News: టిక్కెట్ లేకుండా రైళ్లలో ప్రయాణం.. ప్రయాణికుల నుంచి ఎంత ఫైన్ వసూలు చేశారో తెలిస్తే షాకే..
South Central Railway
Follow us

|

Updated on: Apr 13, 2022 | 7:22 PM

South Central Railway : రైళ్లలో టిక్కెట్ లేకుండా ప్రయాణిస్తున్న వారి చేతి నూనె వదిలిస్తున్నారు రైల్వే అధికారులు.  ఓ రకంగా రైల్వే శాఖకు ఇది కూడా ఓ మంచి ఆదాయ వనరుగా మారిందని చెప్పవచ్చు.  గత ఆర్థిక సంవత్సరం (2021-22) లో దక్షిణ మధ్య రైల్వే జోన్‌లో టికెట్‌ తనిఖీల ద్వారా  ఏకంగా రూ.111.52 కోట్ల ఆదాయం సాధించారు. దీన్ని బట్టి చూస్తే  రోజుకు  దక్షిణ మధ్య  రైల్వే పరిధిలో   రోజుకు రూ. 30 లక్షలకు పైగా ఆదాయం వస్తోంది.  ఈమేరకు   దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్‌ చీఫ్‌ కమర్షియల్‌ మేనేజర్‌ (పీసీసీఎమ్‌) జి.జాన్‌ ప్రసాద్‌ మీడియాకు వివరాలు వెల్లడించారు.  గత ఆర్థిక సంవత్సరం (2021-22)లో టికెట్‌ తనిఖీల ద్వారా రూ.111.52 కోట్ల ఆదాయాన్ని సాధించడంలో కృషి చేసిన రైల్వే బృందాన్ని అభినందించారు. రైళ్లలో టికెట్‌ తనిఖీలతో పాటు ప్రయాణికుల సౌకర్యాలపై కూడా దృష్టి సారించాలని, ప్రయాణికుల ఫిర్యాదులపై వెంటనే స్పందించాలని ఆయన రైల్వే అధికారులకు సూచించారు.

మరింత పారదర్శకత కోసం..

కాగా టికెట్‌ తనిఖీల కోసం హ్యాండ్‌ హెల్డ్‌ టెర్మినల్స్‌ (హెచ్‌హెచ్‌టీలు) మరిన్ని రైళ్లలో టికెట్‌ తనిఖీ సిబ్బందికి అందజేసే అంశంపై ఈ సమావేశంలో చర్చించారు. ఇవి రైల్వే టికెటింగ్‌ వ్యవస్థలో పారదర్శకతను తీసుకురావడంతో పాటు ప్రయాణికులకు మరింత సౌలభ్యాన్ని చేకూరుస్తాయన్నారు. కాగా ఈ సమావేశంలో సెంటర్‌ ఫర్‌ రైల్వే ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్‌ (సీఆర్‌ఐఎస్‌) హెచ్‌హెచ్‌టీల పని తీరుపై సంక్షిప్తంగా ప్రజెంటేషన్‌ ఇచ్చింది. ఈ సందర్భంగా 2021-22 సంవత్సరంలో టికెట్‌ తనిఖీలో మెరుగైన పనితీరు కనబర్చిన అధికారులకు బహుమానాలు అందజేశారు.

Also Read: Supreme Court: వ్యక్తిగత ఖాతాల్లోకి రాష్ట్ర విపత్తు నివారణ నిధులు.. ఆంధ్రప్రదేశ్ సర్కార్‌పై సుప్రీంకోర్టు సీరియస్!

West Bengal: కలకత్తా హైకోర్టులో టీఎంసీ న్యాయవాదుల ఓవరాక్షన్.. కోర్టులోకి వెళ్లకుండా జడ్జిని అడ్డుకొని..

Viral Video : ఓరినీయాసాలో.. సామీ సామీ సాంగ్‌కు రష్మిక రేంజ్‌లో స్టెప్పులేసిన యువకుడు..