Hyderabad MMTS: హైదరాబాద్ వాసులకు అలెర్ట్‌.. భారీగా ఎంఎంటీఎస్‌ సర్వీసులు రద్దు.. పూర్తి వివరాలివే

ఎంఎంటీఎస్‌ రైలు సర్వీసులకు సంబంధించ హైదరాబాద్ ప్రజలకు దక్షిణ మధ్య రైల్వే కీలక అప్ డేట్ చేసింది. ట్రాక్‌ నిర్వహణ పనుల కారణంగా ఇవాళ (శనివారం) పలు రైలు సర్వీసులను రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది.

Hyderabad MMTS: హైదరాబాద్ వాసులకు అలెర్ట్‌.. భారీగా ఎంఎంటీఎస్‌ సర్వీసులు రద్దు.. పూర్తి వివరాలివే
Hyderabad MMTS
Follow us

|

Updated on: Dec 17, 2022 | 4:48 PM

ఎంఎంటీఎస్‌ రైలు సర్వీసులకు సంబంధించ హైదరాబాద్ ప్రజలకు దక్షిణ మధ్య రైల్వే కీలక అప్ డేట్ చేసింది. ట్రాక్‌ నిర్వహణ పనుల కారణంగా ఇవాళ (శనివారం) పలు రైలు సర్వీసులను రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. ఫలక్ నుమా- లింగంపల్లి, లింగంపల్లి – ఫలక్ నుమా, హైదరాబాద్ – లింగంపల్లి, లింగంపల్లి – హైదరాబాద్ మార్గాల్లో నడిచే 10 రైళ్లను రద్దు చేస్తున్నట్లు వివరించింది. ప్రయాణీకులు ఈ మార్పులను గమనించాలని, తమకు సహకరించాలని కోరారు. ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని సూచించారు. రద్దైన రైళ్ల విషయానికొస్తే.. లింగంపల్లి హైదారాబాద్ మార్గంలో 2, లింగంపల్లి హైదరాబాద్‌ రూట్‌లో 2, ఫలక్‌నుమా- లింగంపల్లి మార్గంలో 3, లింగంపల్లి- ఫలక్‌నుమా మార్గంలో 3 రైలు సర్వీసులు రద్దయ్యాయి..

రద్దైన ఎంఎంటీఎస్ రైళ్ల వివరాలివే..

లింగంపల్లి- హైదరాబాద్‌ మార్గంలో..

ఇవి కూడా చదవండి

47139,47140

హైదరాబాద్- లింగంపల్లి రూట్‌లో..

47114, 47118

ఫలక్‌నుమా- లింగంపల్లి మార్గంలో..

47158,47160,47216

లింగంపల్లి- పలక్‌నుమా రూట్‌లో..

47181,47183, 47186

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..