Hyderabad: హైదరాబాద్ ప్రజలకు గుడ్‌న్యూస్.. రోడ్లపైకి కొత్త ఎలక్ట్రిక్ బస్సు సేవలు. .
హైదరాబాద్‌లో బస్సుల రద్దీతో ప్రయాణికులు ఇబ్బంది పడున్నారు. పీక్ అవర్స్‌లో నిల్చోని ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఇక ప్రయాణికుల రద్దీతో బస్సులు ఫుల్ కావడంతో ఇబ్బంది పడుతూ వెళ్లాల్సి వస్తుంది. ఈ క్రమంలో ఆర్టీసీ కొత్త బస్సులను ఎప్పటికప్పుడు ప్రవేశపెడుతోంది. తాజాగా..

హైదరాబాద్ ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్ తెలిపింది. నగరంలో కొత్త ఎలక్ట్రిక్ బస్సులను మరికొన్ని అందుబాటులోకి తీసుకొస్తుంది. సిటీ బస్సుల్లో రద్దీ ఎక్కువ కావడం, ప్రయాణికులు అసౌకర్యాన్ని గురవుతున్న క్రమంలో పర్యావరణరహిత 65 ఎలక్ట్రిక్ బస్సులను కొత్తగా రోడ్లపైకి తీసుకురానుంది. బుధవారం ఈ బస్సులను రాణిగంజ్ డిపోలో ఆర్టీసీ అధికారులు ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ రవాణాశాఖా మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ అధికారులు పాల్గొననున్నారు. ఈ బస్సులను ఈవీట్రాన్స్ అనే సంస్థ ఆపరేట్ చేయనుంది.
ఈవీట్రాన్స్ సంస్థకు బాధ్యతలు
బుధవారం ఉదయం పది గంటలకు రాణిగంజ్ డిపోలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించనున్నట్లు ఆర్టీసీ అధికారులు స్పష్టం చేశారు. అయితే ఇప్పటికే హైదరాబాద్ నగరంలోని పలు రూట్లలో ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్న విషయం తెలిసిందే. నగరంలో రోజురోజుకు పెరిగిపోతున్న కాలుష్యాన్ని తగ్గించాలనే లక్ష్యంతో ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీ వివిధ రూట్లలో నడుపుతోంది. ప్రయాణికుల రద్దీకి తగ్గట్లు కొత్త బస్సులను తీసుకొస్తోంది. విడతల వారీగా కొత్త ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడుతోంది. అందులో భాగంగా ఇప్పుడు 65 బస్సులను తీసుకొచ్చింది. వీటి నిర్వహణను ఈవీట్రాన్స్ సంస్థ చూసుకోనుంది.
2030 నాటికి భారీగా ఎలక్ట్రిక్ బస్సులు
అటు రంగారెడ్డి జిల్లాలోని ప్యూచర్ సిటీలో జరుగుతున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో గ్రీన్ ఎనర్జీపై జరిగిన ప్యానెలో డిస్కషన్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా 2030 నాటికి హైదరాబాద్‌లో భారీగా ఎలక్ట్రిక్ బస్సులను తీసుకొస్తామని ప్రకటించారు. 2047 వరకు గ్రీన్ ఎనర్జీపై ప్రణాళికతో ముందుకెళ్తామని అన్నారు. హైదరాబాద్‌లో జనాభా ఎక్కువగా నివసిస్తున్న కారణంగా వాతావారణ కాలుష్యం కూడా పెరుగుతోంది. కాలుష్యాన్ని తగ్గించడంలో భాగంగా ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వం తీసుకొస్తుంది.
